టాలీవుడ్ ప్రేక్షకులే కాకుండా భారత దేశ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికులు అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి బాహుబలి సిరీస్ సినిమాల తర్వాత ఓ నేషనల్ స్టార్ డైరెక్టర్ గా ఎదిగిపోయాడు. ప్రస్తుతం రాజమౌళి తెలుగులో సినిమాలు తీస్తున్నా బాలీవుడ్ డైరెక్టర్లను సవాల్ చేస్తున్నాడు. బాహుబలి ది కంక్లూజన్ సినిమా తర్వాత రాజమౌళి ఏ సినిమా తీస్తున్నా అది ఇప్పుడు నేషనల్ వైడ్ గా హాట్ టాపిక్ అవుతోంది. 


కేవలం ఓ ప్రాంతీయ మార్కెట్ బేస్ చేసుకుని సినిమాను తెరకెక్కించే డైరెక్టర్ సినిమా ఈరోజు జాతీయ స్థాయిలో మార్మోగిపోయేలా చర్చకు వస్తోంది అంటే... అదంతా రాజమౌళి క్రెడిట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఆర్ ఆర్ ఆర్ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా... రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ సరసన ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్ గా నటిస్తోంది. ఎన్టీఆర్ సరసన ముందుగా హాలీవుడ్ నటి డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. ఇప్పుడు ఆ పాత్ర నుంచి ఆమె తప్పుకోవడంతో ఎన్టీఆర్ పక్కన మళ్ళీ హీరోయిన్ ను వెతకాల్సిన పరిస్థితి రాజమౌళికి వచ్చింది.


డైసీ త‌ప్పుకోవ‌డంతో ఎన్టీఆర్ ప‌క్క‌న ప్ర‌భాస్ సాహోలో న‌టిస్తోన్న బాలీవుడ్ బ్యూటీ శ్ర‌ద్ధాక‌పూర్‌ను సంప్ర‌దించ‌గా... ఆమె డేట్లు ఖాళీ లేక‌పోవ‌డంతో ఈ ఆఫ‌ర్ తిర‌స్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. ఇక లేటెస్ట్ టాక్ ప్ర‌కారం ఎన్టీఆర్ ప‌క్క‌న న‌టించే హీరోయిన్ల‌లో బాలీవుడ్ న‌టి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరు కొత్త‌గా చేరింది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ స్వయంగా పేరును ఈ సినిమా కోసం రాజమౌళి కి రికమెండ్ చేసినట్లుగా తెలుస్తోంది. మ‌రి ఈ వార్త‌లు ఎంత వ‌ర‌కు నిజ‌మో ?  రాజ‌మౌళి ఎన్టీఆర్ ప‌క్క‌న జాక్వెలిన్‌ను ఓకే చేస్తాడో ?  లేదో ? అన్న‌ది త్వ‌ర‌లోనే తేల‌నుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: