నిన్నటి తరం హీరోయిన్ విజయశాంతి ముఖానికి మేకప్ వేసుకుని చాలా కాలం అయ్యింది. పాత తరాన్ని ఓ ఊపు ఊపేసిన లేడీ స్టార్ విజయశాంతి. బహుశా ఆమె కొనసాగించినంత కాలం స్టార్ డమ్ ఏ హీరోయిన్ కూడా కొనసాగించలేదేమో. 


చాన్నాళ్ల తర్వాత విజయశాంతి ఓ సినిమా ఒప్పుకుందని సమాచారం. డైరెక్టర్ అనిల్ రావిపూడి మొత్తానికి ఆమెను ఓ పాత్ర కోసం ఒప్పించాడట. మహేశ్ బాబు 26వ సినిమాకి అనిల్ రావిపూడి దర్శకుడిగా వ్యవహరిస్తారు.

ఈ సినిమాలో ఓ కీ రోల్ కోసం  విజయశాంతిని సంప్రదించారట. ఈ సినిమా కోసం విజయశాంతి 2 కోట్లు అడిగినట్టు తెలుస్తోంది. కోటి నుంచి కోటిన్నర ఆమెకు ఇచ్చేందుకు అనిల్ రావిపూడి టీమ్ ఒప్పుకున్నట్టు సమాచారం వస్తోంది. ఇదే నిజమైతే విజయశాంతి పారితోషం ఓ స్టార్ హీరోయిన్ తో సమానమన్నమాట. 

రెండో ఇన్నింగ్స్ గ్రాండ్ గా ఉండాలని విజయశాంతి కూడా ఈ సినిమాకు ఒప్పుకుంటున్నట్టు తెలుస్తోంది. రాజకీయాల్లో దశాబ్దాల తరబడి ఉన్నా.. పెద్దగా కలిసివచ్చినట్టు లేదు రాములమ్మకి. మరి ఈ రీఎంట్రీ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో. 



మరింత సమాచారం తెలుసుకోండి: