ఈ సమ్మర్ రేస్ ను క్లైమాక్స్ కు తీసుకువెళుతూ ‘మహర్షి’ మూవీ మే 9న విడుదల చేయడానికి రంగం సిద్ధం అవుతోంది. ఈమూవీకి అత్యంత భారీ ఓపెనింగ్స్ రాబట్టే విధంగా ఇప్పటికే పలురకాల పబ్లిసిటీ మార్గాలు ఆలోచించడంతో ఈమూవీని మన తెలుగు రాష్ట్రాలతో పాటు అమెరికాలో కూడ అత్యధిక ధియేటర్లలో విడుదల చేయబోతున్నారు. 

సాధారణంగా ఇలాంటి టాప్ హీరోల సినిమాలు విడుదలైన తరువాత కనీసం రెండు వారాల గ్యాప్ తరువాత మాత్రమే మరో సినిమాను విడుదల చేయడానికి ప్రయత్నిస్తారు. ధియేటర్లు దొరకకపోవడం ఒక సమస్య అయితే జనం అంతా ఆ టాప్ హీరో సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కాబట్టి మరొక సినిమా గురించి ఆలోచన చేయరు. 

అయితే ఈ సాంప్రదాయానికి బ్రేక్ ఇస్తూ ప్రస్తుతం ఫెయిల్యూర్ లతో సతమతమవుతున్న సప్తగిరి ‘వజ్రకవచధార గోవిందా’ అల్లు శిరీష్ ‘ఏబిసిడి’ విడుదలకు రెడీ అవ్వడం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ఒక వజ్రం చుట్టూ తిరిగే సినిమా కథ సప్తగిరిది అయితే అమెరికా నుండి వచ్చిన ఒక ధనవంతుడి కొడుకు ఇండియాలో పడేపాట్లు గురించి వివరించే మూవీ ‘ఏబిసిడి’ 

ఈ ఇద్దరి హీరోలకి ప్రస్తుతం విజయం చాల అవసరం. అయితే మహేష్ ‘మహర్షి’ మ్యానియాను లెక్క చేయకుండా విడుదల అవుతున్న వీరిద్దరి సాహసం వెనుక ‘మహర్షి’ రిజల్ట్ గురించి ముందుగానే తెలిసిపోయిందా అంటూ మరి కొందరు జోక్స్ చేస్తున్నారు. అయితే టాక్ ఎలా ఉన్నా ‘మహర్షి’ మూవీని ధియేటర్లు కనీసం రెండు వారాల పాటు ఎవరికీ దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థుతులలో ఈ రెండు సినిమాలకు ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అంటూ ఇది కేవలం ఒక పబ్లిసిటీ స్టంట్ మాత్రమే ఈ రెండు సినిమాలు మళ్ళీ వెనక్కు పోతాయి అని అంటున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: