రామ్ గోపాల్ వర్మ ఏది మొదలుపెట్టినా సంచలనంగా మారుతుంది. వర్మ తనకు తానుగా 'లక్ష్మీస్ ఎన్టీఆర్' మూవీని ఆంధ్రప్రదేశ్ లో విడుదల చేయడానికి మీ 1న ముహూర్తం పెట్టుకున్నాడు. అయితే ఎన్నికల చివరి దశ ముగిసే వరకు ఇండియాలో ఎటువంటి పొలిటికల్ బయోపిక్ లు విడుదల చేయడానికి వీలులేదని ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వర్మ అనుకున్న తేదీకి ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తి అయినప్పటికీ 'లక్ష్మీస్ ఎన్టీఆర్' విడుదల కష్టం అని అంటున్నారు. 

అయితే ఈరోజు సాయంత్రం వర్మ విజయవాడ నోవాటెల్ హోటల్ లో పెట్టాలి అనుకున్న మీడియా మీట్ కు ఆ హోటల్ యాజమాన్యం తిరస్కరించడంతో కోపంతో ఊగిపోతున్న వర్మ ఆ హోటల్ బయట రోడ్డు మీద మీడియా మీట్ పెట్టబోతున్నాడు. అయితే ఈ మీడియా మీట్ కు రమ్మని వర్మ స్వయంగా కోరినా లక్ష్మీ పార్వతి సున్నితంగా తిరస్కరించారు అని వార్తలు వస్తున్నాయి. 

దీనితో 'లక్ష్మీ ఎన్టీఆర్' ప్రకటన జరిగిన తిరుపతి మీడియా సమావేశానికి అప్పట్లో వర్మతో కలిసి వచ్చీ హడావిడి చేసిన లక్ష్మీ పార్వతి ఇప్పుడు వర్మకు ఎందుకు డుమ్మా కొట్టింది అన్న విషయమై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. దీనికితోడు వర్మ తీసిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' ఆమెకు అంతగా నచ్చలేదా అన్న సందేహాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. 

అయితే దేశం అంతటా ఎన్నికల కమీషన్ నిబంధనలు అమలులో ఉన్న నేపథ్యంలో వర్మ నడిరోడ్డు మీద పెడదామని ప్రయత్నిస్తున్న ఈ మీడియా మీట్ కు పోలీసులు అంగీకరించరు అన్న కామెంట్స్ కూడ వినిపిస్తున్నాయి. అయితే వర్మ ఈ విషయాలను పట్టించుకోకుండా మరొకసారి మీడియా సంచలనాలకు చిరునామాగా మారాలని ఈ సాయంత్రం తన వంతు ప్రయత్నాలను చేసే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: