నిన్న మంత్రి కెటీఆర్ నెటిజన్లు అడిగిన అనేకప్రశ్నల పై స్పందిస్తూ మధ్యలో రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ టైటిల్ పై తన అభిప్రాయాన్ని తెలియచేస్తూ ఆమూవీకి తాను ‘రీజనల్ రింగ్ రోడ్’ అన్న టైటిల్ రాజమౌళికి సూచిస్తాను అంటూ చేసిన జోక్ రాజమౌళిని చాల లోతుగా ఆలోచింపచేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీకి సరైన టైటిల్ ఆలోచించమని బాలీవుడ్ ఇండస్ట్రీ ప్రముఖుడు కరణ్ జోహార్ సలహా ఇచ్చిన నేపధ్యంలో ఇప్పుడు సరదాగా మంత్రి కేటీఆర్ వేసిన జోక్ తో రాజమౌళి ఎలర్ట్ అయి ఈమూవీకి అన్ని భాషల ప్రేక్షకులకు అర్ధం అయ్యేలా టైటిల్ గురించి మరింత లోతుగా ఆలోచించాలని స్థిరనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదే విషయమై రాజమౌళి తన తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో కూడ ఈమూవీ టైటిల్ గురించి ఆలోచన చేయమని చెప్పినట్లు తెలుస్తోంది.   ఇది ఇలా ఉండగా ఇప్పటికే రెండు సార్లు బ్రేక్ పడ్డ ఈమూవీ షూటింగ్ ఇటీవలే అమీర్ పేట సీఎం క్యాంప్ ఆఫీస్ పరిసరాల్లో ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ జరిగినట్లు సమాచారం.   

ఈమూవీ షూటింగ్ ను దగ్గర నుంచి చూసిన కొంతమంది వ్యక్తుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రంలో క్లాస్ కంటే మాస్ ని మెప్పించే ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయి అన్న విషయాలు తెలుస్తున్నాయి అంటూ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.  ప్రస్తుతం ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కోకా పేట్ లో జరుగుతుందని తెలుస్తోంది. 

ఈ షెడ్యూల్ లో చరణ్ జూనియర్ లు చాల ఉత్సాహంగా పాల్గొంటున్న నేపధ్యంలో వారిద్దరి పై కీలక సన్నివేశాలు తీస్తున్నట్లు సమాచారం. అలియా భట్ డేట్స్ కుదిరేదాకా చరణ్ జూనియర్లకు సంబంధించిన సీన్స్ ను చిత్రీకరిస్తూ ఇప్పటికే జరిగిన ఆలస్యాన్ని కవర్ చేసే ఆలోచనలలో రాజమౌళి ఉన్నట్లు టాక్..  


మరింత సమాచారం తెలుసుకోండి: