నిన్న దేశ వ్యాప్తంగా నాలుగోదశ పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే.  ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నా..ఓటర్లు మాత్రం భాద్యతాయుతంగా తన ఓటు హక్కు వినియోగించుకున్నారు.  ఉదయాన్నే వచ్చి ఓటింగ్ వేసినవారు కొంతమంది అయితే..సాయంత్రం పూట ఎక్కువగా వచ్చారు.  ఇక సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు తమ ఓటు హక్కు వినియోగించుకొని గర్వంగా తాము ఓటే వేశామని టీవిల ముందు ఫోజులు ఇచ్చారు.  8 రాష్ట్రాల్లోని 71 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఓటింగ్ జరిగింది. 

జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ నియోజకవర్గంలో రెండో దశ పోలింగ్ జరిగింది.  అయితే కొంత మంది బాలీవుడ్ సెలబ్రెటీస్ మాత్రం తమ ఓటు హక్కు వినియోగించుకోలేక పోయారు.   ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని ఇంటర్వ్యూ చేసిన సినీ నటుడు అక్షయ్ కుమార్ ఓటు వేయలేకపోయారు. అక్షయ్ పంజాబ్ లో పుట్టినప్పటికీ అతడుకి కెనడియన్ పాస్ట్ పోర్ట్ ఉంది. దాంతో ఆయన ఓటు హక్కుని వినియోగించుకోలేకపోయారు.  నటి దీపిక పదుకోన్ పుట్టింది డెన్మార్క్ లోని కొపెన్ హాగెన్ లో.. ఆమెకి డ్యానిష్ పాస్ పోర్ట్ ఉండడం వలన ఓటేయలేకపోయారు.

నటి కత్రినా కైఫ్ కి యూకే పాస్ పోర్ట్ ఉండడంతో ఆమెకి ఎన్నికల్లో ఓటేసే అవకాశం లేకుండా పోయింది.  నటి అలియాభట్ కూడా ఓటేయలేకపోయింది. ఈ విషయాన్ని ఆమె కొద్దిరోజుల క్రితం స్వయంగా వెల్లడించింది. దానికి కారణం ఆమె బ్రిటీష్ పౌరసత్వం కలిగి ఉన్నారు. మొత్తానికి సెలబ్రెటీలు తమ ఓటు హక్కు వినియోగించుకోకపోవడంపై రక రకాలుగా చర్చలు కొనసాగుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: