తెలంగాణ ఎన్నికల తరువాత రిటర్న్ గిఫ్ట్ అన్న పదం విపరీతంగా ప్రచారంలోకి వచ్చి ఆ పదం జనం వాడుక భాషలో ఎవరూ ఊహించని విధంగా మిళితమై పోయింది. ఇప్పుడు ఈ రిటర్న్ గిఫ్ట్ వ్యవహారం రాజకీయాలను దాటి దిల్ రాజ్ మహేష్ ల మధ్య ‘మహర్షి’ పుణ్యమా అని ఏర్పడ్డ గ్యాప్ ఫలితంగా మహేష్ అనీల్ రావిపూడిల మూవీ ప్రాజెక్ట్ నుండి దిల్ రాజ్ తప్పుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. 

అయితే మహేష్ ఈమూవీ ప్రాజెక్ట్ నుండి కావాలని దిల్ రాజ్ ను తప్పించాడ లేదంటే దిల్ రాజ్ తనకు తానుగా ఈమూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఇండస్ట్రీ వర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. ‘మహర్షి’ మూవీ నిర్మాణం మార్కెటింగ్ విషయంలో భాగస్వాముల మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలు మహేష్ కు కూడ తలనొప్పిగా మారాయి అన్న గాసిప్పులు వచ్చిన విషయం తెలిసిందే. 

దీనితో అసహనానికి లోనైన మహేష్ భవిష్యత్ లో తన సినిమాలు ఇద్దరు ముగ్గురు నిర్మాతలు కలిసి ఉండే పార్టనర్ షిప్ వ్యవహారంలో సినిమాలు చేయకూడదని మహేష్ భావిస్తున్నట్లు నిన్న మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈవార్తలను మహేష్ పిఆర్ టీమ్ వెంటనే ఖదించింది.

ఆ వార్తలు వచ్చి ఒకరోజు పూర్తి కాకుండానే ఇలా దిల్ రాజ్ అనీల్ రావిపూడి మహేష్ ల మూవీ ప్రాజెక్ట్ నుండి తప్పుకుని పూర్తి నిర్మాణ బాధ్యతలు అంతా నిర్మాత అనీల్ సుంకర్ కు అప్పచెప్పినట్లుగా గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. దీనితో ఈ వ్యవహారం పరిశీలిస్తున్న వారు మహేష్ దిల్ రాజ్ కు ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ అనుకోవాలా అంటూ ఇండస్ట్రీ వర్గాలలో జోక్స్ పడుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: