తెలుగు ఇండస్ట్రీలో అష్టాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని ఆ మద్య మారుతి దర్శకత్వంలో భలే భలే మగాడివోయ్ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నాడు.  ఆ తర్వాత వరుసగా ఆరు హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగారు.  ప్రస్తుతం నానితో చిత్రాలు తీయడానికి దర్శక, నిర్మాతలు ఎంతో ఉత్సాహాన్ని చూపిస్తున్నారు.  ఆ మద్య కృష్టార్జునయుద్దం, దేవదాసు కాస్త నిరాశపరిచినా..ఈ మద్య రిలీజ్ అయిన ‘జెర్సీ’బ్లాక్ బస్టర్ అయ్యింది.   

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందిన 'జెర్సీ' ఈ నెల 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలిరోజునే విడుదలైన అన్ని కేంద్రాల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ఈ చిత్రంలో ఎమోషన్స్ కి తెలుగు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు.  కేవలం మౌత్ టాక్ తో ఈ చిత్రం అన్ని థియేటర్స్ లోను పరుగులు తీస్తోంది. 

ఇక జెర్సీ 11 రోజుల్లో ఈ చిత్రం 25 కోట్లకి పైగా వసూలు చేసింది. ఇక వచ్చే వసూళ్లన్నీ బయ్యర్లకు లాభాల పంటే అంటున్నారు సినీ విశ్లేషకులు.  వాస్తవానికి ఈ చిత్రం 40 కోట్లకు చేరువలో ఉండాల్సి ఉన్నా..ఇదే సమయంలో కాంచన 3, అవేంజర్స్ చిత్రాలు రిలీజ్ కావడంతో వసూళ్లపరంగా కాస్త దెబ్బైనట్లు కనిపిస్తుంది. మొత్తానికి నాని కెరీర్ లో మంచి వసూళ్లు సాధించిన చిత్రం అని చెప్పొచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: