ఎవరినైనా మనం ఇష్టపడితే.. వారినే పదే పదే చూస్తుంటాం.. ఒక్కోసారి ఆ చూపులు అవతలి వారిని ఇబ్బంది పెడతాయి కూడా. అయినా పట్టించుకోం. ఇలాంటి పరిస్థితే హీరోయిన్ సాయి పల్లవికీ వచ్చిందట. ఆమె ఇటీవల సూర్యతో NGK సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. 


ఈ సినిమా మే 31న రిలీజ్ కాబోతోంది. ఇటీవల చెన్నైలో ఈ సినిమా ఆడియో, ట్రైలర్‌ విడుదల వేడుక జరిగింది. ఈ సందందర్భంగా  సాయిపల్లవి తన ఫీలింగ్స్ పంచుకున్నారు. ఆమె ఏమన్నారంటే.. నేను సూర్య సర్‌కు వీరాభిమానిని. సినిమా షూటింగ్‌లో సూర్యను ఎక్కువగా గమనించేదాన్ని. దీంతో ఆయన సెట్‌లో అసౌకర్యంగా ఫీల్‌ అయ్యి ఉంటారు.

 షాట్‌కు ఆయన ఎలా సిద్ధమౌతున్నారు, ఆ పాత్రలో ఎలా ఒదిగిపోతున్నారని బాగా గమనించేదాన్ని. సూర్య సెట్‌లోని అందరు టెక్నీషియన్లతోనూ ప్రేమగా మాట్లాడుతుంటారు. వారి కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకుంటుంటారు. 

నేను మరో 20 ఏళ్లు పనిచేసినా.. సూర్య పడ్డ శ్రమలో సగం కూడా చేయలేను. అలాంటి వ్యక్తితో కలిసి పనిచేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నా. ఆయన మిలియన్‌లో ఒకరు. ఈ ప్రాజెక్టులో నేను నటించడం సంతోషంగా ఉంది. నేను ఓ సీన్‌ కోసం 50 టేక్‌లు తీసుకున్నప్పటికీ సూర్య విసుగు తెచ్చుకోలేదు, నేను సౌకర్యవంతంగా ఉండేలా ప్రవర్తించారు.. అంటూ సూర్యను తెగ మెచ్చుకుంది సాయిపల్లవి. 



మరింత సమాచారం తెలుసుకోండి: