మెగా మేనల్లుడు సాయి తేజ్ విషయంలో జరిగిన పొరపాట్లు అతడి తమ్ముడు వైష్ణవ్ తేజ్ విషయంలో జరగకూడదు అన్న పట్టుదల పై చిరంజీవి ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వైష్ణవ్ తేజ్ తొలి సినిమా ప్రారంభం అయి ఆమూవీ షూటింగ్ ఇంకా ప్రారంభించక పోవడానికి గల కారణం చిరంజీవి అని అంటున్నారు. 

ఒక యంగ్ హీరోకు సంబంధించిన తొలిసినిమా లాంచింగ్ సరిగ్గా లేకపోతే ఆమూవీకి క్రేజ్ ఏర్పడక ఫలితంగా ఆ యంగ్ హీరోకు క్రేజ్ కూడ సరిగ్గా ఉండదనీ చిరంజీవి అభిప్రాయం అని అంటున్నారు. అందువల్లనే వైష్ణవ్ తేజ్ మూవీని కొద్దిగా భారీ స్థాయిలోనే తీయమని చిరంజీవి సలహాలు ఇస్తున్నట్లు టాక్. 

దీనితో ఈ మూవీలో నటించే నటీ నటులను బాగా క్రేజ్ ఉన్న వారినే తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో అత్యంత కీలకమైన నెగిటివ్ పాత్రకు చిరంజీవి సలహాతో విజయ్ సేతుపతిని ఎంపిక చేసినట్లు టాక్. 

ప్రస్తుతం ఇతడు ‘సైరా’ మూవీలో నటించిన నేపధ్యంలో అక్కడ అతడితో చిరంజీవికి ఏర్పడిన సాన్నిహిత్యం రీత్యా విజయ్ ను బలవంత పెట్టి చిరంజీవి వైష్ణవ్ తేజ్ సినిమాలో నటించే విధంగా ఒప్పించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవైపు సాయి తేజ్ భవిష్యత్ సినిమాల గురించి సలహాలు ఇస్తూ మరొక వైపు మరో మేనల్లుడు వైష్ణవ్ తేజ్ విషయంలో చిరంజీవి తీసుకుంటున్న శ్రద్ధ చూస్తుంటే మెగాస్టార్ కు మెగా మెనల్లుళ్ళు అంటే ఎంత ఇష్టమో అర్ధం అవుతుంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: