రేణుదేశాయ్.. పవన్ కల్యాణ్ మాజీ భార్య.. ఆమె ఓ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి అన్న సంగతి అందరికీ తెలుసు.. పవన్ కల్యాణ్ ఇద్దరు పిల్లలు ఆమె వద్దే పెరుగుతున్నారు. ఇటీవల ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారు. ఆయన ఐటీ రంగానికి చెందిన వ్యక్తి.


ఈ వివరాలు ఇప్పటికే రేణూ దేశాయ్‌  పలు ఇంటర్వ్యూల్లో చెప్పింది కూడా. అయితే ఇటీవల ఆమె తన ఫ్యాన్స్ తో లైవ్ చాట్ నిర్వహించింది. తన ఫ్యాన్స్ తో మరిన్ని విశేషాలు పంచుకుంది. ఈ సమయంలో వపన్ కల్యాణ్ ఫ్యాన్స్ కొందరు ఆమెతో మాట్లాడందుకు ప్రయత్నించారు. 

చాలా ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పిన రేణూ.. ఒకటి, రెండు ప్రశ్నలవిషయానికి వస్తే బాగా చిరాకు పడ్డారు. అసలు ఇలాంటి ప్రశ్నలు ఎలా వేస్తారు.. మీరు.. సెలబ్రెటీలకు పర్సనల్ లైఫ్ ఉండదా.. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న మిమ్మల్ని  మీ సంస్కారానికే వదిలేస్తున్నా అంటూ మండిపడ్డారు.   

దేనికైనా ఓ హద్దు ఉంటుందన్నట్టుగా రేణూ దేశాయ్ స్పందించారు. తన కాబోయే భర్త ఓ ఐటీ ఎంప్లాయ్ అనీ.. ఆయన ప్రైవసీని దెబ్బ తీసే హక్కు ఎవరికీ లేదని రేణూ అన్నారు. పర్సనల్ ప్రశ్నలు అడగటం మంచిది కాదని హితువు పలికారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: