టాలీవుడ్‌లో ఒకోసారి ఒక‌రి బ్యాడ్ ల‌క్ మ‌రొక‌రికి గుడ్ ల‌క్ అవుతుంటుంది. ద‌ర్శ‌కులు కొన్ని హిట్ సినిమాల క‌థ‌ల‌ను ముందుగా ఓ హీరోకు వినిపించ‌డం... వారు నో చెప్ప‌డం జ‌రుగుతుంటుంది. ఆ త‌ర్వాత అదే క‌థ‌ల‌ను ఆ ద‌ర్శ‌కులే మ‌రో హీరోతో చేసి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్లు కొడుతుంటారు. ప‌వ‌న్‌క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన ఎన్నో క‌థ‌ల‌ను ర‌వితేజ చేసి హిట్ కొట్టాడు. ఇక పోకిరి క‌థ‌ను కూడా ముందుగా పూరి ప‌వ‌న్‌కు చెప్ప‌డం... ప‌వ‌న్ వ‌ద్ద‌న‌డంతోనే మ‌హేష్‌కు వెళ్లింది. ఆ సినిమా ఇండ‌స్ట్రీ హిట్‌.


ఇక మ‌హేష్ కూడా చాలా మంది ద‌ర్శ‌కులు చెప్పిన క‌థ‌ల‌ను రిజెక్ట్ చేసి సూప‌ర్ హిట్లు కోల్పోయాడు. జూనియ‌ర్ ఎన్టీఆర్ కూడా ఇదే ప‌రిస్థితి ఎదుర్కొన్నాడు. సరిగ్గా ఇదే తరహాలో మహేష్ బాబు వద్దన్న కథ ఒకటి నాని చేస్తున్నాడు. అదే గ్యాంగ్ లీడ‌ర్‌. విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో నాని ఓ విభిన్న పాత్ర‌లో న‌టిస్తున్నాడు. ఐదుగురు వివిధ వయసుల్లో ఉన్న లేడి గ్యాంగ్ కు లీడర్‌గా ఉండే నాని వాళ్ల‌ను ఎందుకు క‌ల‌వాల్సి వ‌చ్చింది... వాళ్ల బాధ్య‌త ఎందుకు తీసుకున్నాడ‌న్న క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది.


ఈ క‌థ‌ను విక్ర‌మ్ ముందుగా మ‌హేష్‌కు చెప్ప‌డం... ఐదుగురు మ‌హిళ‌ల బ్యాచ్‌ను ర‌క్షించ‌డం త‌న ఇమేజ్‌కు సూట్ అవ్వ‌ద‌ని మ‌నోడు భావించ‌డం... ఈ క‌థ‌కు నో చెప్పిన‌ట్టు టాక్‌. మ‌ధ్య‌లో విక్ర‌మ్ ఇదే క‌థ‌ను బ‌న్నీకి కూడా చెప్ప‌గా బ‌న్నీ కూడా నో చెప్పాడంటున్నారు. చివ‌ర‌కు నాని ఇమేజ్‌తో ప‌నిలేకుండా ఈ క‌థ‌ను ఓకే చేయ‌డంతో ఫైన‌ల్‌గా గ్యాంగ్‌లీడ‌ర్ టైటిల్‌తో ఈ సినిమా రెడీ అవుతోంది. మ‌రి చిరు గ్యాంగ్‌లీడ‌ర్ స్టైల్లో నాని ర‌ప్ఫాడిస్తాడా ?  లేదా ?  చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: