ఒక పరభాష హీరో లేదా హీరోయిన్ కు మన టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో క్రేజ్ ఏర్పడితే చాలు ఆ పరభాష హీరో హీరోయిన్స్ గతంలో వారి మాతృ భాషలో నటించిన పాత సినిమాలను తక్కువ రేట్లకు కొని వాటిని తెలుగులో డబ్ చేసి మంచి టైటిల్స్ పెట్టి విడుదల చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న సాంప్రదాయం. వాస్తవానికి డబ్ చేయబడ్డ ఆపాత సినిమాలు అన్నీ వాటి మాతృ భాషలలో ఫెయిల్ అయినా మన నిర్మాతలు పట్టించుకునే స్థితిలో లేరు. 

ఇప్పుడు ఇదే పరిస్థితి క్రేజీ హీరోయిన్ రష్మికకు కూడ ఎదురౌతోంది. ప్రస్తుతం ఈమె క్రేజ్ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో తారా స్థాయి ఉన్న నేపధ్యంలో ఆమె నటించిన సినిమా అంటే చాలు బయ్యర్లు ఎగబడి కొంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో రష్మిక కన్నడంలో 2017 లో నటించిన ‘చమక్’ మూవీని ‘గీత ఛలో’ పేరుతో తెలుగులో డబ్ చేస్తున్నారు. 

రష్మిక నటించిన మొదటి తెలుగు సినిమా ‘ఛలో’ ఆమెకు క్రేజీ హీరోయిన్ గుర్తింపు తీసుకు వచ్చిన ‘గీత గోవిందం’ మూవీ టైటిల్స్ ను కలిపి ఇలా ‘గీత ఛలో’ గా మార్చారు. వాస్తవానికి కన్నడంలో వచ్చిన ‘చమక్’ మూవీ పెద్దగా హిట్ అవ్వలేదు. 

ఈమూవీలో రష్మికతో హీరోగా కన్నడ హీరో గణేష్ నటించాడు. పెద్దగా గుర్తింపు రాని  ఈమూవీని ‘గీత ఛలో’ గా మార్చి భారీ రేట్లకు రష్మిక క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు బిజినెస్ చేస్తూ ఉండటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారి రష్మికకు కూడ షాక్ ఇస్తున్నట్లు సమాచారం..  


మరింత సమాచారం తెలుసుకోండి: