సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజా హెగ్డే హీరో హీరోయిన్లుగా నటిస్తున్న మహర్షి మూవీ ట్రైలర్‌ అదరగొడుతోంది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన విక్టరీ వెంకటేష్ ఈ ట్రైలర్‌ను లాంచ్ చేశారు. మహేష్ బాబు హీరోగా నటించిన 25వ చిత్రం మహర్షి కావడం విశేషం. 


ఈ కార్యక్రమానికి టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా వచ్చాడు. ఈ వేడుకపై విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు కాస్త ఓవర్ అనిపించాయి. కానీ ఆ మాత్రం లేకపోతే విజయదేవరకొండ ఎలా అవుతాడు అనిపించింది కూడా.. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే.. 

" మహేష్ బాబు గారికి నేను పెద్ద అభిమానిని. కాలేజ్ లో ఉన్నప్పుడు మహేష్ బాబు అని పిలుచుకునేవాళ్లం. ఇప్పుడు యాక్టర్ అయిన తరువాత మహేష్ సర్ ని పిలవాల్సి వస్తుంది. మనవాడు అనుకునేవాళ్లం.. ఇప్పుడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడాల్సివస్తోంది.. 

అప్పుడప్పుడు మహేష్ అని  వచ్చేస్తుంది.. . మురారి సినిమా నుండి ఆయన్ని ఫాలో అవుతున్నాను. అలాంటి హీరో నా సినిమాలకు ట్వీట్ వేయడం సంతోషంగా అనిపించింది. ఈ సినిమా మే 9న రిలీజ్ అవుతుంది. ఆరోజు నా పుట్టినరోజు.. ఆరోజు రాబోతున్న ఈ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా'' అంటూ ముగించాడు విజయ్ దేవరకొండ.



మరింత సమాచారం తెలుసుకోండి: