‘మహర్షి’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జరిగి ఒక్కరోజు పూర్తి కాకుండానే ఆ ఫంక్షన్ లో మహేష్ ప్రవర్తించిన తీరు పై ఇండస్ట్రీ వర్గాలలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మహేష్ తన ఉపన్యాసంలో కేవలం తనకు సక్సస్ ఇచ్చిన డైరెక్టర్ల పేర్లు మాత్రం చెప్పి తనకు సక్సస్ ఇవ్వలేకపోయినా నటుడుగా అతడి స్థాయిని పెంచి అతడికి నందీ అవార్డులు వచ్చేలా చేసిన కొందరి ప్రముఖ దర్శకుల పేర్లు కనీసం తన స్పీచ్ లో చెప్పక పోవడం ఎంతవరకు సంస్కారం అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

మహేష్ కు ఉత్తమ నటుడుగా నంది అవార్డులు తెచ్చిపెట్టిన ‘నిజం’ సినిమా డైరెక్టర్ తేజా గురించి అదేవిధంగా ‘మురారి’ సినిమాకు దర్శకత్వం వహించిన కృష్ణవంశీ గురించి ‘1 నేనొక్కడినే’ లాంటి సినిమాను తీసిన సుకుమార్ గురించి ఒక్క మాట కూడ తన మాటలలో ఆ దర్శకుల పేర్లు వినిపించలేదు. దీనితో మహేష్ కు విజయాలు తెచ్చిపెట్టిన దర్శకుల పేర్లు గుర్తుంటాయి కానీ అతడికి నంది అవార్డులు తెచ్చిపెట్టి నటుడుగా అతడి స్థాయిని పెంచిన దర్శకుల పేర్లు గుర్తుకు రావా అంటూ మహేష్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

అంతేకాదు ఒక సినిమా సక్సస్ విషయంలో ఒక హీరో పాత్ర మాత్రమే కాకుండా ఆసినిమా సక్సస్ కు లేదా ఫెయిల్యూర్ కు ఆసినిమాకు పనిచేసిన హీరోతో సహా అందరి బాధ్యతా ఉంటుంది అని తరుచూ చెప్పే మహేష్ తన ఫెయిల్యూర్ సినిమాల విషయంలో బాధ్యతను దర్శకుల పై నెట్టేస్తున్నాడా అంటూ మరికొందరు సెటైర్లు వేస్తున్నారు. మహేష్ సూపర్ స్టార్ కాకముందు వచ్చిన ‘నిజం’ మురారి’ సినిమాలలో మహేష్ నటనలోని సమర్ధత కనిపించడంతో ఆసినిమాలతో నంది అవార్డులు తెచ్చుకున్నాడు మహేష్. 

అయితే నంది అవార్డులు కన్నా మహేష్ కు కలక్షన్స్ రికార్డులు ముఖ్యంగా మారిపోవడంతో ఇలా మహేష్ తన అంచనాలు అందుకోలేకపోయిన దర్శకుల పేర్లు మర్చిపోయి ఉంటాడు అన్న సెటైర్లు పడుతున్నాయి. ఏమైనా మహేష్ దర్శకుల విషయంలో ఇలా సక్సస్ ను ప్రామాణికంగా తీసుకుని కొందరి పేర్లను కనీసం పేరుకైనా చెప్పకపోవడం అతడి మనస్తత్వాన్ని సూచిస్తోంది అంటూ కొందరి విశ్లేషకుల అభిప్రాయపడుతున్నారు..   


మరింత సమాచారం తెలుసుకోండి: