తాజాగా జరిగిన మహర్షి ప్రీ రిలీజ్‌ వేడుక, టీజర్ తో ఈ సినిమాకు హైప్ వచ్చింది. నిన్న మొన్నటి వరకూ ఈ సినిమాపై నెగిటివ్ టాక్ నడిచింది. సినిమా ప్రోడక్ట్ బాగా రాలేదని.. నిర్మాతల మధ్య గొడవలు ఉన్నాయని.. మార్కెట్ బాగా కాలేదని ఇలా చాలావచ్చాయి. 


కానీ ఇప్పుడు టీజర్‌, ప్రి రిలీజ్‌ వేడుకతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరో బ్లాక్ బ్లస్టర్ కావచ్చన్న టాక్ వచ్చింది. అయితే ఈ టాక్ తమిళ ఇండస్ట్రీలోకి వెళ్లిందట. మహేశ్ బాబు సినిమాల రీమేక్‌లతో గతంలో క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఈ సినిమాపై కూడా కన్నేసినట్టు ఫిలింనగర్ సమాచారం. 

విజయ్ గతంలో తెలుగులో మహేశ్ బాబు చేసిన 'పోకిరి', 'ఒక్కడు' సినిమాలు , తమిళంలోకి రీమేక్ చేశాడు. ఇవి అక్కడా భారీ విజయాలు సాధించాయి. అందుకే మహిర్షి రీమేక్ హక్కుల గురించి విజయ్ వాకబు చేసినట్టు తెలిసింది. 

మహర్షి ఈ నెల 9వ తేదీన భారీస్థాయిలో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'మహర్షి' ఫలితం ఎలా ఉంటుందో చూసుకుని విజయ్ రీమేక్ రైట్స్ తీసుకునే ఛాన్స్ ఉందట. ఏమాత్రం హిట్ టాక్ వచ్చినా దీన్ని విజయ్ రీమేక్ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మహర్షి హిట్ అయితే ఫ్యాన్సీ ఆఫర్ ఇచ్చి రైట్ తీసుకోవాలన్నది విజయ్ ఆలోచనగా చెబుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: