టాప్ హీరోల సినిమా విడుదల అయ్యాక కనీసం ఆసినిమా మ్యానియా రెండు వారాలు అయినా కొనసాగుతుంది. దీనితో టాప్ హీరోల సినిమా విడుదల అయిన తరువాత వెనువెంటనే వచ్చే వారాలలో పేరున్న మిడిల్ రేంజ్ హీరోలు ఎవరూ తమ సినిమాలను విడుదల చేయడానికి సాహసించరు. 

అయితే అనూహ్యంగా ‘మహర్షి’ విడుదలైన  ఒక వారం గ్యాప్ లోనే ఈనెల 17న నిఖిల్ ‘అర్జున్ సురవరం’ అల్లు శిరీష్ ‘ఎబిసిడి’ ఒకదానిపై ఒకటి పోటీగా విడుదల అవుతున్నాయి. ఈ మూవీల విడుదల తరువాత వెనువెంట వచ్చే మరోక శుక్రువారం తేజ దర్శకత్వం వహించిన కాజల్ బెల్లంకొండల ‘సీత’ విడుదల కాబోతోంది. 

పేరుకు ఈమూడు సినిమాలు చిన్న సినిమాలు అయినా ఈమూవీ దర్శకులు ఈమూడు సినిమాల విషయంలో చాల శ్రద్ధపెట్టి తీసారు అన్న వార్తలు ఉన్నాయి. ఈమధ్య కాలంలో చిన్న సినిమాలలో కొన్ని ఊహించని విజయాలు సాధిస్తున్న ఈ పరిస్థుతులలో ఈ సమ్మర్ రేస్ కు రాబోతున్న ఈమూడు చిన్న సినిమాలలో ఏదైన ఒకటి ఊహించని విజయం సాధించి ‘మహర్షి’ కి షాక్ ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

‘మహర్షి’ మూవీ బడ్జెట్ తో పోల్చుకుంటే ఈమూడు చిన్న సినిమాలకు ఒకొక్క దానిపై 20 కోట్ల లోపే నిర్మాణం పూర్తి చేసారు. దీనితో ఈమూడు చిన్న సినిమాలలో ఏ ఒక్కదానికి పాజిటివ్ టాక్ వచ్చినా వెంటనే ఆమూవీల బయ్యర్లు లాభాలలోకి వచ్చేస్తారు. అదే ‘మహర్షి’ బయ్యర్లు లాభపడాలి అంటే కనీసం 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వస్తే కాని ‘మహర్షి’ బయ్యర్లు గట్టెక్కారు. ఇలాంటి పరిస్థుతులలో మూడు చిన్న సినిమాల మధ్య ‘మాహర్షి’ చిక్కుకోవడం హాట్ టాపిక్ గా మారింది..   


మరింత సమాచారం తెలుసుకోండి: