ఈ మద్య తెలుగు, తమిళ, హిందీ ఇండస్ట్రీల్లో వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్నాయి.  తెలుగు లో మహానటి, యాత్ర, ఎన్టీఆర్ బయోపిక్..ఈ మద్య లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాలు రిలీజ్ అయ్యాయి.  బాలీవుడ్ లో రాజకీయ, క్రీడా, సినీ నేపథ్యంలో బయోపిక్ లు వస్తున్నాయి.  ఇక టాలీవుడ్ లో సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రతిరోజూ సోషల్ మీడియాలో ఈయన పేరు ఏదో ఒక రకంగా వినిపిస్తూనే..కనిపిస్తూనే ఉంది.  ఈ మద్య వర్మ నిర్మించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ఎన్ని కాంట్రవర్సీలు సృష్టించిందో తెలిసిందే. 

ఈ చిత్రం  టీడీపీ శ్రేణుల్లో అగ్గి రాజుకుంది.  అప్పటి నుంచి ఈ చిత్రం ఏపిలో విడుదల కాకుండా ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు.  మరోవైపు ఎన్నికల రిజల్ట్ వచ్చే వరకు ఈ చిత్రం రిలీజ్ చేయవొద్దని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.  తాజాగా రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీస్తానంటూ చంద్రబాబు వీరాభిమానిగా చెప్పుకునే దేవి బాబు చౌదరి ప్రకటించారు.


ఓ యూట్యూబ్ ఛానెల్ లో ఆయన మాట్లాడుతూ..‘ఎర్రగడ్డకు దారేది’ అనే టైటిల్  పెట్టి రామ్ గోపాల్ వర్మ బయోపిక్ తీస్తానని అన్నారు.  లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించినవి అన్ని అబద్దాలే అని తేల్చి చెప్పారు.  చంద్రబాబు గురించి ఆ చిత్రంలో అసత్యాలు ప్రచారం చేసారని మండిపడ్డారు. ఇక కొంతకాలంగా దేవి బాబు చౌదరి డైరక్ట్ గా రామ్ గోపాల్ వర్మకు ఛాలెంజ్ లు విసురుతున్నారు.

తనతో డిబేట్ కు రమ్మనమని చెప్తున్నారు. కానీ వర్మ మాత్రం ఇవేవీ పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్నారు.  ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్  మే 1న ఏపీలో చిత్రం విడుదల చేయాలని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రయత్నాలు చేశారు.  కానీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండటం చేత వీలు కాలేదు..దాంతో ట్విట్టర్ వేదికగా ఆయన ఏపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: