ఈ మాటలు అంటుంది ఎవరో కాదు..ఒకప్పుడు షారూఖ్ ఖాన్ తో ‘దిల్‌ సే’ చిత్రంలోని ‘ఛయ్య ఛయ్యా..’అనే పాటతో  మలైకా తన సినీ కెరీర్‌ను ప్రారంభించారు.  ఆ తర్వాత ‘మున్నీ బద్నామ్‌ హుయీ..డాల్లింగ్ తేరేలియే’అంటూ దబంగ్, తెలుగు లో పవన్ కళ్యాన్ నటించిన గబ్బర్ సింగ్ చిత్రంలో ప్రత్యేక సాంగ్ ‘కెవ్ కేకా ’అంటూ కుర్రాళ్లను గిలిగింతలు పెట్టిన అమ్మడు మలైకా అరోరా..ఇటీవల తన భర్త (సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్) కి విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే. 

నాలుగు పదుల వయసులోనూ ఈ హాట్ బ్యూటీ ఇరవై ఏళ్ల అమ్మాయిలా కనిపిస్తుంది.  అయితే కొంత కాలంగా కొన్ని న్యూస్ ఛానల్స్, వార్తలా పత్రికలు, వెబ్ సైట్స్ లో మలైకా పేరు ముందు ఐటమ్ గర్ల్ అని కవర్ సంబోధిస్తున్నారట.  దీనిపై మలైకా అగ్గిలం మీద గుగ్గిలం అవుతుంది.  ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాల్లో ప్రత్యేకంగా ఆకర్షించడానికి ఓ సాంగ్ ప్లాన్ చేస్తారు..అలాంటి సాంగ్ ఆ చిత్రంలో నటిస్తున్న హీరోయిన్ నటించలేదు కదా..అందుకే ప్రత్యేకంగా వేరే నటీమణులను తీసుకుంటారు.   

అలాంటి సాంగ్స్ నటిస్తే తప్పేముంది..ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో కొనసాగుతుంది.  నేను ఏదన్నా పాటలో నర్తిస్తే దాన్ని అందరూ ఐటెం సాంగ్‌ అంటుంటారు. నాకు చాలా కోపం వస్తుంది. ఒకవేళ నన్ను ఎవరైనా ‘ఆమె ఐటెం గర్ల్‌’ అని అంటే.. వారి పళ్లు రాలగొడతాను. నాకు నచ్చిన విధంగానే నేను ప్రత్యేక గీతాల్లో నర్తించాను.  ‘పటాఖా’ చిత్రంలోని ఓ ప్రత్యేక గీతంలో మలైకా చివరి సారిగా నర్తించారు. త్వరలో ఆమె బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ కపూర్‌ను రెండో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: