గతవారం విడుదలైన 'ఎవెంజర్స్ ఎండ్ గేమ్' హిందీ వర్షన్ కేవలం ఒక్క వారంలో బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 'బాహూబలి' సృష్టించుకున్న రికార్డులను తుడిపివేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 'బాహుబలి 2' హిందీ వెర్షన్ 247 కోట్లు వసూలు చేస్తే 'అవెంజర్స్' హిందీ వెర్షన్ కేవలం వారం రోజులలో 260 కోట్లు వసూలు చేయడం బాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

దీనితో బాలీవుడ్ లో 'బాహుబలి 2' పేరుతో ఉన్న రికార్డులను అన్నింటినీ 'ఎవెంజర్స్ ఎండ్ గేమ్' తుడిచి పెట్టినట్లు అయిపోయింది. బాలీవుడ్ టాప్ హీరోలు ఎన్ని ప్రయత్నాలు చేసినా చెక్కుచెదరని 'బాహుబలి 2' రికార్డులను ఒక హాలీవుడ్ మూవీ హిందీ డబ్బింగ్ బ్రేక్ చేయడం బాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్తోంది. 

ఇప్పటివరకు 'బాహూబలి స్థాయిలో రికార్డులను క్రియేట్ చేయాలని చాలమంది బడా హిందీ నిర్మాణ సంస్థలు తమ వంతు ప్రయత్నాలు చేస్తూ అత్యంత భారీ సినిమాలను నిర్మించినా వాటి కలక్షన్స్ 'బాహుబలి 2' రికార్డులకు దరిదాపుల్లో రాలేకపోయాయి. ఈమధ్య కాలంలో వచ్చిన 'ధగ్స్ ఆఫ్ హిందూస్థాన 'బాహుబలి'  రికార్డుల పై కన్నేసి ఘోరంగా పరాజయం పాలైంది. 

ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు ఈ హాలీవుడ్ హిందీ డబ్బింగ్ కొనసాగిస్తున్న కలక్షన్స్ హంగామాను చూసినవారు ఈమూవీ హిందీ డబ్బింగ్ టోటల్ గా 400 కోట్లకు పైగా కలెక్ట్ చేసి 'బాహుబలి' పార్టీ వన్ పార్టీ2 సినిమాలకు సంబంధించిన 420 కోట్ల కలక్షన్స్ రికార్డులను బ్రేక్ చేసినా ఆశ్చర్యం లేదు అని అంటున్నారు. ఒకవిధంగా ఈ హాలీవుడ్ మూవీ సృష్టిస్తున్న సంచలనాలు రాజమౌళి మైండ్ ను బ్లాంక్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: