దాదాపు సౌత్ భాషలన్నిటిలో నటించింది న‌టి మీరాజాస్మిన్‌. 2004లో వ‌చ్చిన ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గుడుంబా శంక‌ర్ సినిమాతో ప‌రిచ‌యం అయిన మీరా ఆ త‌ర్వాత తెలుగులో స్టార్ హీరోలు అంద‌రితోనూ క‌లిసి న‌టించింది. అటు కోలీవుడ్‌తో పాటు ఇటు క‌న్న‌డ్‌, త‌న సొంత ఇండ‌స్ట్రీ అయిన మ‌ళ‌యాళంలోనూ న‌టించింది. కాలం క‌లిసి రాక‌పోవ‌డంతో ఎక్కువ కాలం ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కుకోలేక‌పోయింది. ఆ త‌ర్వాత 2016 లో పెళ్ళి చేసుకొని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. భర్త అనిల్ జాన్ తో కలిసి అమెరికాకు వెళ్ళి అక్క‌డే సెటిల్ అయిపోయింది. మ‌ధ్య‌లో మీరా గురించి న్యూస్ ఏదీ మీడియాలో పెద్దగా హైలెట్ అవ్వ‌లేదు. 


మ‌ధ్య‌లో త‌ల్లిదండ్రుల‌తో ఆమె గొడ‌వ ప‌డింద‌న్న ఒక్క న్యూస్‌తో మాత్ర‌మే ఆమె మీడియాలోకి ఎక్కింది. చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత మీరా ఫొటోలు ఇంట‌ర్నెట్‌లోకి ఎక్కాయి. ఇవి ఇప్పుడు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు మీరా జాస్మిన్ సోదరి వివాహం సందర్భంగా తీసినవని సమాచారం. గ‌తంలో మీరా చాలా లావుగా, బొద్దుగా ఉండేది. ఆమె బరువుపై అప్ప‌ట్లో సెటైర్లు కూడా పేలేవి. ఇక అప్పుడే అలా ఉందంటే పెళ్ల‌య్యాక ఇంకా బ‌రువు పెరిగిపోతార‌ని అంద‌రూ అనుకుంటారు.


మీరా మాత్రం త‌న లుక్‌తో పెద్ద షాకే ఇచ్చింది. త‌న తాజా లుక్‌లో చాలా స్లిమ్ గా బ్యూటిఫుల్ గా ఉంది. ఆమె గ‌త లుక్ చూసిన వారు పెళ్ల‌య్యాక ఇంకా లావు అయిపోతుంద‌ని అనుకుంటారు. కానీ ఇప్పుడు  సన్నజాజిలా స్లిమ్ముగా మారి అందరికీ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. ఇక మీరా త‌న తాజా ఫొటోలో మ‌ళ‌యాళ సూప‌ర్‌స్టార్ దిలీప్‌తో క‌లిసి పోజు ఇచ్చింది. ఈ ఫొటో చూస్తేనే ఆమె ఎంత‌లా స‌న్న‌గా ఉందో అర్థ‌మ‌వుతోంది. ఇక ఈ స్టిల్ బ‌య‌ట‌కు వ‌చ్చిన వెంట‌నే మ‌ళ్లీ దిలీప్ - మీరా కాంబోలో ఓ సినిమా తెర‌కెక్కుతోంద‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. దిలీప్ – మీరా జాస్మిన్ గతంలో మూడు సార్లు కలిసి నటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: