టాలీవుడ్‌లో త‌క్కువ వ‌య‌స్సులోనే వరుస హిట్ల‌తో గోల్డెన్ గ‌ర్ల్‌గా పేరు తెచ్చుకుంది ర‌కుల్‌ప్రీత్‌సింగ్‌. వ‌రుస హిట్ల‌తో త‌క్కువ టైంలోనే ఎన్టీఆర్‌, మ‌హేష్ లాంటి స్టార్ హీరోల‌తో ఛాన్సులు కొట్టేసింది. ఆ త‌ర్వాత ఆమె అనుష్క‌, న‌య‌న‌తార రేంజ్‌లో టాప్ హీరోయిన్ అవుతుంద‌ని అనుకున్నా వ‌రుస ప్లాపులు వెక్కిరించ‌డంతో రేసులో బాగా వెన‌క‌ప‌డిపోయింది. సౌత్‌లో అవ‌కాశాలు త‌గ్గ‌డంతో చివ‌ర‌కు బాలీవుడ్లో కూడా త‌న అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటోంది. 


ప్ర‌స్తుతం ర‌కుల్ బాలీవుడ్ సీనియ‌ర్ హీరో అజ‌య్‌దేవ‌గ‌న్‌తో ఓ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమాలో ర‌కుల్ రోల్ 50 ఏళ్ల‌కు పై వ‌య‌స్సు ఉన్న‌ వ్యక్తి ప్రేమలో పడే 26 ఏళ్ల అమ్మాయి పాత్ర‌లో క‌నిపిస్తోంది. ఆ 50 ఏళ్ల వ్య‌క్తిగా అజ‌య్‌దేవ‌గ‌న్ న‌టిస్తున్నాడు. ఆ 26 ఏళ్ల ప‌డుచుగా ర‌కుల్ న‌టిస్తోంది. ఇక అజ‌య్ రోల్‌కు అప్ప‌టికే పెళ్ల‌య్యి పిల్ల‌లు కూడా ఉంటారు. అజ‌య్ భార్యగా సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు న‌టిస్తోంది.పెళ్లాం, స‌వ‌తి స్టోరీల‌తో ఇప్ప‌టికే బాలీవుడ్‌, ఇటు ద‌క్షిణాదిలో లెక్క‌కు మిక్కిలిగా సినిమాలు వ‌చ్చాయి. అయితే క‌థ‌నంలో కొత్త‌ద‌నం ఉంటే సినిమా హిట్ట‌వుతుంది. 


ఇదిలా ఉంటే ర‌కుల్ నిజ‌జీవితంలోనూ ఓ అబ్బాయితో ప్రేమ‌లో ప‌డేందుకు రెడీగా ఉన్నాన‌ని చెపుతోంది. ఒక‌వేళ నిజ‌జీవితంలోనూ నీకంటే వ‌య‌స్సులో చాలా ఎక్కువ ఉన్న వ్య‌క్తిని ఇష్ట‌ప‌డాల్సి వ‌స్తే ఏం చేస్తావు ? అన్న ప్ర‌శ్న‌కు కూడా ఆమె ఆన్స‌ర్ ఇచ్చింది. తాను నిజ‌జీవితంలోనూ ప్రేమ‌లో ప‌డేందుకు వ‌య‌స్సుతో సంబంధం లేద‌ని... యువ‌కుడు అయినా .... కాస్త వ‌య‌స్సు పైబ‌డిన వాడు అయినా మ‌న‌స్సుకు న‌చ్చితే చాల‌ని అంటోంది. ఇప్పుడు ప్రేమ‌లో ప‌డేందుకు అబ్బాయి వేట‌లోనే ఉన్నాన‌ని కూడా ర‌కుల్ ముక్తాయించింది.


మరింత సమాచారం తెలుసుకోండి: