తాజాగా త్రివిక్రమ్- అల్లు అర్జున్ కొత్త సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం హిందీలో భారత్, దేదే ప్యార్ దే సినిమాలు చేస్తోంది. మీడియాతో కాసేపు ముచ్చటించిన టబు.. హైదరాబాద్ తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంది. ఇన్ని సినిమాలు చేశారు కదా.. తీరని కోరికలు ఉన్నాయా అని అడిగితే.. ఓ మూడు కోరికలు చెప్పింది. 


ఈ ముదురు భామకు ట్రెక్కింగ్ అంటే చాలా ఇష్టమట. కొండలు, గుట్టలు ఎక్కడమంటే ఇష్టమట. కానీ ఇంతవరకూ ఎక్కనే లేదట.. ట్రెక్కింగ్ చేద్దామని గత పదిహేనేళ్లుగా అనుకుంటునే ఉందట. కానీ ఈ కోరిక మాత్రం ఇంతవరకూ తీరనే లేదట. ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో అంటోంది. 

ఇక మరో కోరిక కూడా కొండలకు సంబంంధించింది. ఎత్తయిన కొండపై ఇల్లు కట్టుకోవాలన్నది మరో తీరని కోరిక అట. అలాంటి చోట నివసిస్తే ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో అంటోంది. అవును బాగానే ఉంటుంది.. కానీ ఎప్పుడు తీరుతుందో.. 

ఇక చివరి కోరిక అందరూ గుర్తుంచుకునే అద్భుతమైన పాత్ర పోషించాలని ఉందట. మరి ఈ కోరిక ఎప్పుడు తీరుతుందో. ఏమో చెప్పలేం అంటోంది. గత ఐదేళ్లుగా సినిమాలు లేవు అనుకుంటూనే చాలా సినిమాలు చేశానంటోంది. ఇలా తన తీరని కోరికల చిట్టా బయటపెట్టింది టబు. 



మరింత సమాచారం తెలుసుకోండి: