హీరోయిన్ రక్ష.. అంటే పెద్దగా గుర్తుపట్టరు కానీ.. ప్రేమలేఖ సినిమాలో చిన్నాదానా.. ఓసి చిన్నాదాన.. ఆశపెట్టేసి పోమాకే కుర్రాదానా..అనే పాట చెప్పగానే గుర్తుపట్టేస్తారు. అంతగా ఆ పాట పాపులర్ అయ్యింది. ఆ పాట కోసమే పదుల సార్లు సినిమాకెళ్లిన కుర్రకారు ఉన్నారు అప్పట్లో..


ఆ సినిమాతో బాగానే పేరు తెచ్చుకున్నా.. ఆ తర్వాత అమ్మడికి పెద్దగా అవకాశాలు రాలేదు. ఇటీవల కొన్ని సినిమాలతో రీ ఎంట్రీ ఇచ్చి అమ్మ క్యారెక్టర్లు, అక్క క్యారెక్టర్లు చేస్తోంది. నచ్చావులే సినిమాలో నటకు ఆమెకు నంది అవార్డు కూడా వచ్చింది. 

అయితే నటి రక్ష ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా ఓ డైరెక్టర్ గూబ పగలగొట్టేసిందట. ఈ విషయాన్ని తానే ఇటీవల ఆలితో సరదాగా ప్రోగ్రామ్‌లో రివీల్ చేశారు. ఏంట్రా.. ఏం చెప్పి తీసుకొచ్చావ్.. ఏం చేయమంటున్నావ్ అంటూ రెచ్చిపోయిందట. మీదకు ఉరికి వెళ్లి గూబ పగలగొట్టేసిందట. 

ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరో అన్న విషయం మాత్రం ఫుల్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే. నచ్చావులే సినిమా బాగా ఆడినా తర్వాత మాత్రం అంతగా అవకాశాలు రాలేదంది.. ఎక్కడినుంచో ఆర్టిస్తులను తెస్తున్నారు. మేం లేమా.. అంటూ ఆవేదన వ్యక్తం చేసింది రక్ష.



మరింత సమాచారం తెలుసుకోండి: