నిన్న దాసరి నారాయణరావు జన్మదినోత్సవం సందర్బంగా జరిగిన డైరెక్టర్స్ డే వేడుకలకు అతిధిగా చిరంజీవి వచ్చి చేసిన ఉపన్యాసంలో దాసరి నారాయణరావుతో తనకు ఉన్న మనవడి వరస గురించి ఒక షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. తనకు దాసరి నారాయణరావుకు ఒక విచిత్రమైన చుట్టరికం ఉందనీ తాను వరసకు దాసరికి మనవడిని అవుతాను అన్న విషయం దాసరి తనకు స్వయంగా చెప్పి షాక్ ఇచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

తాను దాసరి నారాయణరావుతో చేసిన సినిమా ‘లంకేశ్వరుడు’ ఒక్క సినిమానే అయినా ఆసినిమాతో తనకు దాసరితో ఏర్పడిన సాన్నిహిత్యం దాసరి జీవించి ఉన్నంతకాలం కొనసాగింది అన్న విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. తాను చనిపోయే అనారోగ్య పరిస్థుతులలో ఉన్నప్పుడు కూడ దాసరిని తాను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తన ‘ఖైదీ నెంబర్ 150’ ఎలా ఉన్నాయి అని అంటూ మాట్లాడలేని స్థితిలో కాగితం పై వ్రాసి తనను అడిగిన సందర్భాన్ని తాను జీవితంలో మరిచిపోలేను అంటూ చిరంజీవి కామెంట్స్ చేసాడు. 

1940 కాలం నుండి ఇండస్ట్రీని ఏలిన ఎందరో దర్శకుల గురించి తాను విన్నానని అయితే దాసరి లాంటి మంచి వ్యక్తిత్వం గల దర్శకులు చాల అరుదుగా ఉంటారనీ అంటూ ఇండస్ట్రీలో ఎవరికీ అవకాశాలు లేక ఆర్ధిక బాధలతో సతమతమైపోతుంటే వారందరి బాధను తన బాధగా భావించిన ఏకైక వ్యక్తి దాసరి అని షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఇదే సందర్భంలో దాసరి పుట్టినరోజునాడు అవకాశాలు లేక పేదరికంతో సతమవుతున్న దర్శకుల సహాయార్ధం ఏర్పాటు చేసిన ఫండ్ కు అడగకుండానే రాజమౌళి 50 లక్షలు ఇవ్వడం అదేవిధంగా చిరంజీవి 20 లక్షలు ఇవ్వడం ఆ ఫంక్షన్ లో హాట్ టాప్ గా మారింది. 

దాసరి పేరిట నెలకొల్ప బడుతున్న ఈ ఫండ్ కు కేవలం నిన్న ఒక్కరోజులోనే వేదిక పై కోటి రూపాయల విరాళాలు ప్రకటించడమే కాకుండా ఈ ఫండ్ కు 10 కోట్లు వసూలు చేసి అవకాశాలు లేక ఆర్ధికబాధలతో సతమవుతున్న దర్శకులకు సహాయం చేసే ఆలోచనకు నిన్నటి వేదిక శ్రీకారం చుట్టింది. నిన్న జరిగిన దాసరి పుట్టినరోజు వేడుకలకు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీ ప్రముఖులు అంతా హాజరు కావడంతో దాసరి చనిపోయి రెండు సంవత్సరాలు అయిపోయినా ఇంకా ఆయన ఇమేజ్ కొనసాగుతూనే ఉంది అన్న స్పష్టమైన సంకేతాలు ఇచ్చింది..    



మరింత సమాచారం తెలుసుకోండి: