అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో ప్రారంభం అయిన మూవీ రెండవ షెడ్యూల్ ప్రారంభం కాకుండానే బన్నీ సుకుమార్ దర్శకత్వంలో నటించబోతున్న సినిమాకు ఈ నెల కొబ్బరి కాయ కొట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ తో సుకుమార్ సినిమా క్యాన్సిల్ అయిన తరువాత వేగంగా సుకుమార్ కోసం రంగంలోకి దిగిన అల్లు అర్జున్ ఇంత వేగంగా ఈసినిమాను సెట్స్ పైకి తీసుకు వస్తాడని ఎవరు అనుకోలేదు. 

అయితే ఈ వ్యవహారం అంతా సుకుమార్ కు ఆత్మ స్థైర్యాన్ని కలిగించడానికా లేదంటే త్రివిక్రమ్ సినిమాను చేస్తూనే మరొక వైపు సుకుమార్ సినిమాను నడిపిస్తాడా అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకవైపు దిల్ రాజ్ నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో బన్నీ ఈ సంవత్సరం చివరి నుండి మరో సినిమా చేయవలసి ఉంది. 

అయితే త్రివిక్రమ్ సినిమా కనీసం 30 శాతం కూడ పూర్తి కాకుండా ఇప్పుడు ఇదే నెలలో అల్లు అర్జున్ సుకుమార్ ల మూవీ ప్రారంభోత్సవం జరుపుకుంటూ ఉండటం వెనుక సుకుమార్ ఒత్తిడి బన్నీ పై విపరీతంగా ఉంది అని అంటున్నారు. దీనితో అల్లు అర్జున్ ఒకేసారి మూడు సినిమాల ముప్పేట వ్యూహం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

‘మహర్షి’ మూవీ ఈ నెల 9న విడుదల అవుతుంటే సుకుమార్ అల్లు అర్జున్ ల మూవీ కేవలం రెండు రోజుల గ్యాప్ తో ఈనెల 11న ప్రారంభం అవ్వబోతోంది. దీనితో ‘మహర్షి’ రిజల్ట్ తెలిసిన తరువాత ప్రారంభం కానోతున్న బడా మూవీ కావడంతో అనుకోకుండా ‘మహర్షి’ కి డివైడ్ టాక్ వస్తే సుకుమార్ మరింత ఆనందంతో బన్నీ మూవీ ప్రారంభం రోజున మరింత జోష్ లో కనిపించే ఆస్కారం ఉంది.. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: