చిరంజీవి నటిస్తున్న భారీ చిత్రం ‘సైరా’ సెట్ లో జరిగిన ప్రమాధం పై కొన్ని మీడియా సంస్థలు ప్రచురిస్తున్న రకరకాల కథనాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ ఔట్ స్కర్ట్స్ లోని కోకాపేట పరిసరాల్లో చిరంజీవి ఫామ్ హౌస్ లో వేసిన ‘సైరా’ భారీ సెట్ మంటల్లో ధగ్ధమై పోవడంతో ఈ ప్రమాదం వల్ల ఈమూవీ నిర్మాతలకు 2 కోట్ల నష్టం వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఈ ప్రమాదం గురించి ఇప్పుడు రకరకాల వార్తలు మీడియా వర్గాలలో ప్రచారంలోకి వస్తున్నాయి. ఈవిధంగా `సైరా` సెట్ తగలబడడం వెనక  జనసేనాని పవన్ కల్యాణ్- చిరంజీవి వ్యతిరేకుల కుట్ర దాగి ఉందన్న వాదన కూడ కొందరు ప్రచారంలోకి తీసుకు వస్తున్నారు. 

అయితే ఈ వార్తలను మెగా కాంపౌండ్ ఖండిస్తోంది.  అసలు ఈ ఘటనలో ఉన్న వాస్తవాలేంటి అన్న విషయమై ఫైర్ స్టేషన్ అధికారుల వెర్షన్ వేరుగా ఉండడంతో ఇప్పుడు రకరకాల చర్చలకు ఆస్కారం అవుతోంది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈవిషయమై ఫైర్ నిపుణులు వేరే అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. 

ఫైర్ వ్యాపించడానికి కొద్ది సేపటి ముందు వరకూ అక్కడ షూటింగ్ జరిగినట్లుగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ ప్రదేశంలో షార్ట్ సర్క్యూట్ జరగడానికి ఆస్కారం లేదని కొందరి వాదన. అయితే కొందరు ఫైర్ స్టేషన్ అధికారులు మాత్రం ఈ ఘటనలో ఊహించని కోణం ఉంది అన్న అభిప్రాయంలో ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ సెట్ తగలబడినప్పుడు ఇలాంటి సందేహాల్ని కొందరు వ్యక్తం చేశారు. దీనితో ‘సైరా’ సెట్ ప్రమాదం పై పూర్తి విచారణ జరిగిన తరువాత మాత్రమే అసలు విషయాలు బయటకు వాస్తాయి అన్న వార్తలు వినిపిస్తున్నాయి..   



మరింత సమాచారం తెలుసుకోండి: