‘మహర్షి’ మూవీ విడుదలై ఇంకా టాక్ బయటకు రాకుండానే ఈ సినిమా దర్శకుడు వంశీ పైదిపల్లిని టార్గెట్ చేస్తూ మహేష్ అభిమానులు వేస్తున్న వింత ప్రశ్నలు చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ‘మహర్షి’ మూవీ బడ్జెట్ రకరకాల కారణాలతో 120 కోట్ల స్థాయిని మించిపోవడంతో ఈమూవీ బిజినెస్ 120 కోట్ల స్థాయిని మించి చేయవలసి వచ్చింది. 

అయితే నిర్మాతలు ఎంత ప్రయత్నించినా ఈమధ్య కాలంలో విడుదలైన భారీ సినిమాల ఘోర పరాజయాల కారణాలతో పాటు గత సంవత్సరం విడుదలైన మహేష్ ‘భరత్ అనే నేను’ బయ్యర్లకు కొన్ని చోట్ల వచ్చిన నష్టాల రీత్యా ‘మహర్షి’ ని అనుకున్న స్థాయిలో బిజినెస్ చేయలేకపోవడంతో ఈమూవీ కొంత మేరకు నష్టాలతో విడుదలవుతోంది. ఇప్పుడు ఈవార్తలు వైరల్ కావడంతో మహేష్ అభిమానుల టార్గెట్ లో వంశీ పైడిపల్లి చిక్కుకున్నాడు. గత అనుభవాల రీత్యా ‘మహర్షి’ బయ్యర్లు నష్టపోకుండా ఈమూవీ నిర్మాతలు ఈసినిమా టిక్కెట్లకు సంబంధించి  తొలి వారం అంతా ఈమూవీ టిక్కెట్ల రేటును 200 రూపాయలకు పెంచడం మహేష్ అభిమానులకు ఏమాత్రం నచ్చలేదు అని టాక్. 

అభిమానులు మహేష్ పై ఉండే క్రేజ్ తో టిక్కెట్ ధర ఎంత ఉన్నా ఖర్చు పెట్టి చూస్తారని అయితే ఈమూవీ టాక్ విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా ఇంత డబ్బు ఖర్చు పెట్టి ‘మహర్షి’ వెంటనే చూడాలా అన్న ఆలోచన చేస్తూ సాధారణ ప్రేక్షకుడు ‘మహర్షి’ ని చూసే విషయంలో ఒక వారం వాయిదా వేస్తే ఈమూవీ కలక్షన్స్ విషయంలో ఘోరంగా అంచనాలు తారుమారు అవుతాయని మహేష్ అభిమానుల వాదన. ‘మహర్షి’ కి జరుగిన బిజినెస్ రీత్యా ఈమూవీ బయ్యర్లు కనీసం నష్టాలు లేకుండా బయటపడాలి అంటే 120 కోట్ల నెట్ కలక్షన్స్ ‘మహర్షి’ కి వచ్చితీరాలి. 

అలాంటి నెట్ కలక్షన్స్ ఒక సినిమాకు రావాలి అంటే ఆమూవీ పై టోటల్ పాజిటివ్ టాక్ ఉండాలి. ఇలాంటి విచిత్రమైన పరిస్థితి దర్శకుడు వంశీ పైడిపల్లి ‘మహర్షి’ మూవీ పై అదుపులేకుండా పెట్టిన భారీ ఖర్చు వల్ల వచ్చిందనీ ఒక విధంగా ‘మహర్షి’ కి టాక్ బాగా వచ్చినా కలక్షన్స్ రికార్డుల విషయంలో వెనకపడితే అది కేవలం వంశీ పైడిపల్లి ఈమూవీ విషయమై అనుసరించిన మితిమీరిన ఖర్చు వల్ల మాత్రమే అంటూ ఈమూవీ రిజల్ట్ ఇంకా తెలియకుండానే వంశీ పైడిపల్లిని మహేష్ అభిమానులువింత ప్రశ్నలు వేస్తున్నారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: