మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘డిస్కో రాజ’ మూవీని పవన్ కళ్యాణ్ సన్నిహితుడు రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి విఐ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న నేపధ్యంలో రవితేజాకు నిర్మాత రామ్ తాళ్ళూరికి ఈమూవీ బడ్జెట్ విషయంలో ఏర్పడిన భేదాభిప్రాయాలు పవన్ కళ్యాణ్ రాయబారాలతో ఈ మూవీ కష్టాలు గట్టేక్కినట్లు తెలుస్తోంది.

ఈమూవీ బడ్జెట్ ను ఏకంగా ఒకేసారి 10 కోట్ల వరకు నిర్మాత రామ్ తాళ్ళూరి తగ్గించి వేయడం రవితేజాకు తీవ్ర అసహనం కలిగించడంతో ఈమూవీ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి మాస్ మహారాజ సమ్మర్ హాలిడేస్ ను ఎంజాయ్ చేయడానికి విదేశాలకు వెళ్ళిపోయాడు. ఇలాంటి పరిస్థుతులలో తన ‘జనసేన’ కు ఎన్నో విధాలుగా సహకరించిన రామ్ తాళ్ళూరి కోసం పవన్ రంగంలోకి దిగి రవితేజ రామ్ తాళ్ళూరి మధ్య ఏర్పడ్డ భేదాభిప్రాయాలకు ఒక పరిష్కారం కనుక్కోవడంతో ఈమూవీ షూటింగ్ 27 నుంచి ప్రారంభం కావడానికి కౌంట్ డౌన్ మొదలైంది. 

అంతేకాదు రవితేజ ప్రస్తుత తన మార్కెట్ రీత్యా ఈమూవీ బడ్జెట్ ను కొంత వరకు తగ్గించడానికి పవన్ చేసిన సూచనతో అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈనెల 23న ఎన్నికల ఫలితాలు వెల్లడి కాబోతున్న నేపధ్యంలో ఈ ఫలితాల తరువాత పవన్ సన్నిహితుడు నిర్మిస్తున్న మూవీ డిస్కో రాజ తిరిగి పట్టాలు ఎక్కడం వెనుక అన్ని విధాల పవన్ సహకారం ఉంది అని అంటున్నారు. 

ఎన్నికలలో ‘జనసేన’ కోసం ప్రచారం చేసే విషయంలో రామ్ తాళ్ళూరి కంపెనీలోని ఉద్యోగులు అంతా ‘జనసేన’ కోసం పనిచేయడమే కాకుండా ‘జనసేన’ విధి విధానాలను సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి పవన్ పై వచ్చే నెగిటివ్ వార్తలను ఖండించడానికి ఒక స్పెషల్ టీమ్ ను రామ్ తాళ్ళూరి పవన్ కళ్యాణ్ కోసం మొన్న జరిగిన ఎన్నికలలో ఒక సైన్యంలా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. తనకు ఇంత చేసిన తన ప్రియమిత్రుడి కోసం పవన్ కళ్యాన్ పరోక్షంగా అందించిన సహాయంతో ఎట్టకేలకు మళ్ళీ ‘డిస్కో రాజ’ ప్రారంభం అవుతోంది అన్న ప్రచారం జరుగుతోంది.. 


మరింత సమాచారం తెలుసుకోండి: