తెలుగు ఇండస్ట్రీలో విలక్షణ నటుడు, కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు.  ఆయన సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి మెప్పించారు. అలనాటి ఎన్టీఆర్,ఏఎన్ఆర్ తో నటించి..చిరంజీవి, వెంకటేష్, నాగార్జులతో నటించిన ఇటీవల జూ.ఎన్టీఆర్, రాజ్ తరుణ్ లాంటి కుర్ర హీరోలతో సైతం నటించారు.  ఇండస్ట్రీలో ఆయనకు ఛాన్స్ రావడానికి..తన కెరీర్ మంచి పొజీషన్ లోకి వెళ్లడానికి తన గాడ్ ఫాదర్..గురువు ఒక్కరే దాసరి నారాయణ రావు..అని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అలాంటి దాసరి నారాయణ రావు ఆస్తి విషయంలో సెన్సేషన్ కామెంట్ చేశారు మోహన్ బాబు.


మా గురువు గారు దాసరి నారాయణ రావు జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చాయి..అవి నాకు సాధ్యమైనంద వరకు పరిష్కరించడానికి ప్రయత్నించా..పరిష్క రించాను.  కానీ ఒక్క దాసరి నారాయణరావు కుటుంబంలో ఆస్తి వివాదాలను పరిష్కరించలేకపోయానని  ఆవేదన వ్యక్తం చేశారు మోహన్ బాబు. తాజాగా దాసరి టాలెంట్ అకాడమీ 2019 సంవత్సరానికి సంబంధించి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందించే కార్యక్రమానికి మోహన్ బాబు కూడా విచ్చేశారు.


హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మోహన్ బాబు మాట్లాడుతూ, దాసరి నారాయణరావు కుటుంబ వ్యవహారాలను ప్రస్తావించారు.  దాసరిగారు ఆయన ఆస్తుల పంపకం విషయంలో తనను, మురళీమోహన్ ను ఎంతగానో నమ్మారని, వీలునామాలో పర్యవేక్షకులుగా 'మోహన్ బాబు, మురళీమోహన్' అని ప్రత్యేకంగా తమ పేర్లు కూడా రాయించారని వెల్లడించారు.


తన కుటుంబ సభ్యుల్లో ఎవరికీ అన్యాయం జరగకూడదన్నది దాసరి గారి ఉద్దేశం అని, అందుకే తామిద్దరి పేర్లు వీలునామాలో పొందుపరిచారని వివరించారు. కానీ, తమ అసమర్థత కారణంగా దాసరి గారి ఆస్తుల పంపకాలను సక్రమంగా నిర్వర్తించలేకపోయామని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దాసరికి కేంద్రం భారతరత్న పురస్కారం అందించి గౌరవించాలని ఆర్.నారాయణమూర్తి విజ్ఞప్తి చేశారు.  తిరుపతిలో దాసరి పేరుతో 500 మంది విద్యార్థులు కూర్చునే విధంగా ఆడిటోరియం కట్టించానని, ఇది ఆసియాలోనే అత్యుత్తమం అని పేర్కొన్నారు. కాగా, దాసరి టాలెంట్ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవానికి నటి జయసుధ, దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ, ఆర్. నారాయణమూర్తి, సి. కల్యాణ్ కూడా హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: