మన తెలుగు సినిమా పాటలు అంతర్జాతీయ స్థాయికి వెళ్లడం చాలా అరుదుగా జరిగే సంఘటన. అలాంటి పరిస్థితులలో పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక పాట అంతర్జాతీయ డ్యాన్స్ షోలో సంచలనంగా మారింది. దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మూవీలోని 'ఆడెవడన్నా ఈడెవడన్నా' పాటకు ప్రముఖ అమెరికన్ డ్యాన్స్ షో 'వరల్డ్ ఆఫ్ డ్యాన్స్'లో కింగ్స్ అనే గ్రూప్ పెర్ఫామ్ చేయడం విశేషం. 

ఈ కార్యక్రమం ఈ మధ్య అమెరికన్ టివీలలో ప్రసారం అయినట్లు వార్తలు వస్తున్నాయి.  మన తెలుగు ఛానల్ లో ప్రసారం అయ్యే 'ఢీ' తరహా కార్యక్రమం అది. ఈ డాన్స్ షోలో    దేవిశ్రీ ప్రసాద్ పాటకు తమ నృత్య ప్రతిభను క్రియేటివ్ కాన్సెప్ట్ ను జోడించడమే కాకుండా ఏరోబిక్స్ టాలెంట్ ను కూడా చూపిస్తూ  అమెరికన్ టివిలో ప్రసారం అయిన ఈపాటకు ఆ కార్యక్రమంలోని అమెరికన్ జడ్జీలు కూడ ఫిదా అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.  

ఒక తెలుగు మాస్ పాటకు అమెరికన్ టీవీ షోలో డ్యాన్సర్లు వీర లెవెల్లో డ్యాన్స్ చేస్తుంటే చూడటం ఆ దేశంలోని మన తెలుగువారికి మాత్రమే కాకుండా అక్కడి అమెరికన్స్ కూడ ఎంజాయ్ చేసినట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో తన పాటకు అమెరికన్ టివి షోలో స్థానం రావడమే కాకుండా ఆ పాటకు విపరీతమైన పాపులారిటి వచ్చినందుకు దేవిశ్రీ మంచి జోష్ లో ఉన్నట్లు టాక్. 

గతంలో చిరంజీవి నటించిన 'ఖైదీ నంబర్ 150' సినిమాలోని ‘సుందరి’ పాటకు కూడా ఇలాగే అమెరికన్ టివి లోని డాన్స్ షోలో స్థానం లభించి అక్కడ పాపులర్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈవార్తలు ఇలా బయటకు రావడంతో అమెరికాలోని పవన్ అభిమానులు ఇదే పాటను వచ్చే నెలలో జరగబోతున్న తానా మహా సభలలో కూడ ప్రదర్శింప చేసి మరొకసారి పవన్ మ్యానియాను అమెరికాలోని తెలుగువారికి గుర్తుకు చేసుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్.. 



మరింత సమాచారం తెలుసుకోండి: