తెలుగు సినిమా ఓ ప్రాంతీయ సినిమా అన్నది ఎప్పటి నుంచో ఉన్న వాదన. దాన్ని బాహుబలి వంటి సినిమాతో రాజమౌళి తప్పని నిరూపించారు. ఇప్పుడు సాహో వంటి సినిమాలు అదే బాటలో నడుస్తున్నాయి. మరి తెలుగు పాటను అంతర్జాతీయ స్థాయిలో నిలిపారు పవన్ కల్యాణ్‌ అంటున్నారు ఆయన ఫ్యాన్స్.


పవన్ కల్యాణ్  సినిమా సర్దార్ గబ్బర్ సింగ్ ఫ్లాప్ అయినా ఇప్పుడు పవన్ కు అంతర్జాతీయంగా పేరు తెచ్చింది. ఈ  సినిమాలోని వాడెవన్నా వీడెవన్నా అనే పాట ఓ ఇంటర్నేషనల్ చానల్‌లో వరల్డ్ ఆఫ్ డాన్స్ అనే రియాల్టీ షోలో అదరగొట్టిందట. ఈ షోకు జడ్జ్ ఎవరో తెలుసా.. జెన్నిఫర్ లోపెజ్. 


 ద కింగ్స్ అనే ఇండియన్ కుర్రాళ్ల టీం ఈ పాటకు అదరగొట్టేలా డాన్స్ చేసి అలరించిందట. సర్దార్ పాటను యాజ్ టీజ్ గా కాకుండా దానికి 300 హాలీవుడ్ మూవీ, బాహుబలి వంటి మరికొన్ని సినిమా కాన్సెప్టులు మిక్స్ చేసి అలరించారు. ఆ పాటకు డాన్స్ వేస్తున్నంత సేపూ విపరీతమైన స్పందన కనిపించింది. 


షోలో పాల్గొన్న ప్రేక్షకులతో పాటు జడ్జీలు సైతం కుర్రాళ్ల స్టెప్పులకు మంత్ర ముగ్ధులైపోయారట. డాన్స్ షో పూర్తికాగానే జెన్నిఫర్ స్టాండింగ్ ఓవియేషన్ ఇచ్చి  చప్పట్లు కొట్టి అభినందించారట. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: