రామ్ చరణ్ మహేష్ లు మంచి స్నేహితులు అంతేకాదు వీరిద్దరి భార్యలు ఉపాసన నమ్రతలు మరింత స్నేహంగా ఉంటారు. ఇలాంటి పరిస్థుతులలో చరణ్ రికార్డులకు మహేష్ దెబ్బ కొట్టబోతూ ఉండటంతో చరణ్ కు బయటకు చెప్పుకోలేని బాధ అని అంటున్నారు. 

రేపు విడుదల కాబోతున్న ‘మహర్షి’ ఖచ్చితంగా గత సంవత్సరం రామ్ చరణ్ క్రియేట్ చేసిన ‘రంగస్థలం’ రికార్డులను బ్రేక్ చేస్తుంది అని వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థుతులు. ఐపీఎల్ టోర్నమెంట్ చివరి దశకు చేరుకోవడంతో పాటు మహేష్ సినిమా వచ్చి ఏడాది గడిచిపోవడంతో ‘మహర్షి’ పై విపరీతమైన మ్యానియా ఏర్పడింది. 

ఈసినిమా విడుదలైన మరో రెండు వారాల వరకు ఎన్నికల ఫలితాలు కూడ రావు. ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం జనానికి ఒక ‘మహర్షి’ సినిమా తప్ప మరి ఏభారీ సినిమా అందుబాటులో లేదు. దీనికితోడు ఈసినిమా విడుదల తరువాత కూడ ఈమూవీకి పోటీ ఇవ్వగల మరి ఏభారీ సినిమా లేకపోవడంతో ‘మహర్షి’ మ్యానియాకు ఎదురు లేదు అని అంటున్నారు. 

ఇప్పటికే మహేష్ పవన్ ‘అత్తారింటికి దారేది’ చరణ్ ‘మగధీర’ రికార్డులను తన ‘శ్రీమంతుడు’ మూవీ ద్వారా బ్రేక్ చేసాడు. అయితే గత సంవత్సరం ‘రంగస్థలం’ మూవీతో చరణ్ క్రియేట్ చేసిన నాన్ ‘బాహుబలి’ రికార్డులు ‘మహర్షి’ ఖచ్చితంగా బ్రేక్ చేస్తుంది అని అంటున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ‘మహర్షి’ టాక్ గురించి మహేష్ కంటే ఎక్కువగా చరణ్ టెన్షన్ పడుతున్నాడు అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: