‘మహర్షి’ విడుదలకు ఇక కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే ఈసినిమా కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో తెగ హడావిడి జరుగుతోంది. దీనికితోడు దుబాయ్ సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధూ ఇచ్చిన భారీ రేటింగ్స్ తో మరింత ‘మహర్షి’ మ్యానియా పెరిగిపోయింది. అయితే ఇది అంతా నాణానికి ఒకవైపు మాత్రమే.

ఈమూవీకి అత్యంత కీలకం ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ లో వచ్చే కాలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కు అనుగుణంగా సుమారు 45 నిముషాలసేపు మహేష్ ను స్టూడెంట్ గా చూడవలసిన పరిస్థితి. ఈ సీన్స్ విషయంలో ‘మహర్షి’ టీమ్ చాల నమ్మకంతో ఉన్నప్పటికీ 46 సంవత్సరాల వయసులో ఉన్న మహేష్ ను కాలేజీ స్టూడెంట్ గా జనం చూడగలుగుతారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 

ముఖ్యంగా ఈమూవీ ఫస్ట్ ఆఫ్ లో కాలేజీ సీన్స్ అన్నీ ఫ్లాష్ బ్యాక్ లో వస్తాయి. ఆ సీన్స్ ఎక్కువై ప్రేక్షకులు అసహనానికి లోనైతే దాని ప్రభావం ‘మహర్షి’ సెకండ్ ఆఫ్ చూసే ప్రేక్షకుల పై ఉంటుంది అన్న అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. 

అయితే లుక్ పరంగా మహేష్ ను స్టూడెంట్ గా చూపించడానికి మీసకట్టుతో మహేష్ వయసును తగ్గించడానికి వంశీ పైడిపల్లి తనవంతు ప్రయత్నాలు చాల సీరియస్ గానే చేసాడు. దీనితో మహేష్ విద్యార్ధిగా ఎంత వరకు సక్సస్ అవుతాడు అన్న విషయం పై ‘మహర్షి’ సూపర్ సక్సస్ ఆధారపడి ఉంటుంది అంటూ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: