ఎన్ని సీన్ల‌యినా తీసుకుంటూ పొండి లెక్కంటూ ఉండొద్దు....
అస‌లు క‌ట్స్ అంటూ లేకుండా ఫైన‌ల్ ఔట్ పుట్ ఓకే చేసేయ్యండి....
డైరెక్ట‌ర్ విజ‌న్ అన్న‌ది ఏమైన‌ట్లు.. స‌రిగ్గా మ‌హ‌ర్షి సినిమా విష‌యంలో జ‌రిగిందిదే....


మ‌హేశ్ గ‌త సినిమాల్లోనూ ఇదే వైఫ‌ల్యం
మురారీ త‌రువాత ఒక్క‌డు త‌రువాత ఇంకొన్ని
ఒక్క‌డు సినిమాకు ప‌నిచేసిన శ్రీ‌క‌ర్ ప్ర‌సాద్ చెప్పిన సూత్రం ప‌నిచేసి సినిమా సూప‌ర్ డూప‌ర్ హిట్ కొట్టింది. హీరోను ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో  ఇంట్ర‌డ్యూస్ చేయ‌క స్ట్ర‌యిట్ నెరేష‌న్ లో నే ఆయ‌న‌ను ప‌రిచ‌యం చేయాల‌ని అప్పుడే సినిమా వ‌ర్కౌట్ అవుతుంద‌ని చెప్పి గుణ‌శేఖ‌ర్ తో మ‌ళ్లీ సీన్స్ రీ షూట్ చేయించారాయ‌న.. దీంతో సినిమాకో తుది రూపం వ‌చ్చింద‌న్న‌ది ఇండస్ట్రీలో అప్ప‌ట్లో వినిపించిన మాట.. త‌రువాత పోకిరి క్లైమాక్స్ లో కూడా  ప్ర‌కాశ్ రాజ్ ని కొడితే సౌండ్ ఆఫ్ అయిపోయేలా చేసింది కూడా ఎడిట‌ర్ కాదు స్టంట్ మాస్ట‌ర్ విజ‌య‌న్ .. ఆ సీన్ ఎంత‌గా వ‌ర్కౌట్ అయ్యిందో.. కానీ ఆ సీన్ ని పండించింది ఎడిట‌ర్ టేబుల్ ద‌గ్గ‌రే..


ఇక మురారీ స‌మ‌యంలోనూ ఎడిటింగ్ టెక్నిక్స్ అన్న‌వి లేవన్న‌ది ఓ విమ‌ర్శ.. ఇలా మ‌హేశ్ ప్ర‌తి సినిమాలోనూ ఎడిట‌ర్ కు ప‌నిలేకుండా పోతుందా లేకా ప‌నిచేయ‌కుండా పోనిస్తున్నారా ? అన్న‌ది అంతుప‌ట్ట‌ని విష‌యం. తాజాగా మ‌హ‌ర్షి సినిమాలోనూ  ఎడిటింగ్ విభాగ‌మే అత్యంత పేల‌వంగా ప‌నిచేసింద‌ని ఓ విమ‌ర్శ.. సినిమాను స‌రిగా ట్రిమ్ చేయ‌కుండా వ‌దిలేశార‌ని సీన్లు కూడా ఎక్కువెక్కువగా లాగ్ అయ్యాయ‌ని ప్రేక్ష‌కులు పెద‌వి విరుస్తున్నారు.. మ‌రి ఈ త‌ప్పుని స‌రిదిద్దుతారో అలానే ఉంచేస్తారో తేలాలిక.


ఇక ప్ర‌తిసారి మ‌హేష్ విష‌యంలోనూ ఇలా సినిమా ల్యాగ్ అయిపోయింద‌న్న విమ‌ర్శ ఎందుకు కంటిన్యూ అవుతోంది ?  దీనిని ఈ సినిమా యూనిట్ ఎందుకు ?  స‌రి చేసుకోలేక‌పోతోంద‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డుస్తున్నాయి. శ్రీమంతుడు, భ‌ర‌త్ అనే నేను సినిమాల విష‌యంలో ఇదే టాక్ వ‌చ్చింది. శ్రీమంతుడు ర‌న్ టైం బాగా ఎక్కువుగా ఉన్నా కంటెంట్‌లో ద‌మ్ముతో కొట్టుకుపోయింది. ఇక ఓ విధంగా భ‌ర‌త్‌కు క‌లెక్ష‌న్లు త‌గ్గ‌డానికి ర‌న్ టైం ఎక్కువే అన్న టాక్ కూడా ఉంది. ఇక ఇప్పుడు మ‌హ‌ర్షి టోట‌ల్‌గా 4 గంట‌ల ర‌న్ టైంలో వ‌స్తే దానిని క‌ష్ట‌ప‌డి రెండు నిమిషాల త‌క్కువ మూడు గంట‌ల‌కు కుదించారు. ఇప్పుడు ఈ స్లో నెరేష‌న్ సినిమాను ప్రేక్ష‌కులు అంత సేపు చూడ‌డానికి, ఇటు రిపీట్‌గా థియేట‌ర్‌కు వ‌చ్చేందుకు ఇష్ట‌ప‌డ‌ర‌ని అంటున్నారు. మ‌రి మ‌హేష్ నెక్ట్స్ సినిమాల విష‌యంలో అయినా దీనిని స‌రిదిద్దుకుంటాడేమో ?  చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: