అదేంటో గుండెకు అందానికి అతి పెద్ద లింక్. అక్కడ సొగసు సెగ అలా కొట్టగానే ఇక్కడ గుండె లయ తప్పుతుంది. బ్రహ్మకైన రిమ్మ తెగులు కలుగుతుంది అన్నది అక్షరాలా  నిజమే మరి. తాను చేసిన బొమ్మను తానే  వలచి కలత  పడిపోతాడా విధాత. మరి అలా సన్నగా నవ్వగానే పడిపోయే కిర్రాక్  జనానికి  అందమంతా ఇదే అంటూ కేరాఫ్ అడ్రస్ చెప్పేస్తే ఇక వూరుకుంటుందా చిట్టి గుండే. చిట్లిపోదూ...


హార్ట్ అటాక్ రాదూ, అసలే ఆమె హార్ట్ అటాక్ హీరోయినాయే. ఆదా శర్మ  పేరుట. పాపం అమ్మడికి బొత్తిగా ఆదా తెలియదే ఒక్క బట్టలలో తప్ప. ఉన్నడి ఉన్నట్లుగా చూపించేస్తూ వెర్రెక్కిస్తోందిగా. హార్ట్ ఎటాక్ బ్యూటీ అదా శర్మ తమ అభిమానులకు నిజంగానే హార్ట్ ఎటాక్ తెచ్చేలా ఉంది. క్యూట్ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకునే ఈ అందాల భామ.. సడన్‌గా ఒంటి మీద నూలుపోగు కూడా లేకుండా ప్రత్యక్షమైంది. మీసాలు పెట్టుకుని, ఎద అందాలను జుట్టుతో కప్పేసి నేలపై కూర్చొన్న ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేసింది. 


అయితే, ఇదంతా తాను త్వరలో చేయబోయే సినిమా కోసమని కూల్‌గా చెప్పింది అదా. ‘మ్యాన్ టు మ్యాన్’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అదా లింగమార్పిడితో స్త్రీగా మారే వ్యక్తి పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాకు అబిర్ సేన్‌గుప్తా దర్శకత్వం వహిస్తున్నారు. పురుషుడిగా పుట్టిన వ్యక్తి.. మహిళగా మారి మరో పురుషుడిని పెళ్లి చేసుకుంటాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తి జీవితం ఎలా మలుపు తిరుగుతుంది? తన భార్య గతంలో మగాడని తెలుసుకున్న భర్త ఏం చేస్తాడు? తదితర అంశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.  అదన్న మాట అసలు మ్యాటర్. కానీ ఇక్కడ గుండె మీటర్ తప్పేసిందిగా. ఎంతైనా ఆదా శర్మ  అలజడి స్రుష్టించగలదంటే ఇదే మరి. 


మరింత సమాచారం తెలుసుకోండి: