గరుడవేగ తరువాత యాంగ్రీ సీనియర్ హీరో రాజశేఖర్ చేస్తున్న సినిమా కల్కి. గురువారం మ‌హ‌ర్షి, జెర్సీ సినిమాలు ఆడుతోన్న థియేట‌ర్ల‌లో రిలీజ్ అయిన ట్రైల‌ర్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వ‌స్తోంది. కొద్ది రోజుల క్రితం వ‌చ్చిన టీజ‌ర్‌తోనే క‌ల్కి ప్రి రిలీజ్ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోయింది. రాజ‌శేఖ‌ర్ చాలా రోజుల త‌ర్వాత గ‌రుడ‌వేగ సినిమాతో సూప‌ర్ హిట్ కొట్ట‌డంతో ఆ ఎఫెక్ట్ క‌ల్కి బిజినెస్‌పై బాగా ప‌డింది. క‌ల్కి ప్రి రిలీజ్ బిజినెస్ దుమ్ము రేపింది.


ఆంధ్ర అంతా కలిపి క‌ల్కి రైట్స్ రూ 5.5 కోట్ల‌కు సేల్ అయ్యాయి. ఇక నైజాం, ఓవ‌ర్సీస్ క‌లిపి రూ.6 కోట్ల‌కు కొనేశారు. తమిళ నటుడు ధనుష్ కు చెందిన కంపెనీ, నిర్మాత రాధామోహన్ ఈ సినిమా రైట్స్ ఠ‌క్కున కొనేశారు. టీజ‌ర్‌తోనే ప్రి రిలీజ్ బిజినెస్ కంప్లీట్ చేసుకున్న క‌ల్కి ట్రైల‌ర్ అంచ‌నాల‌ను ఇంకా పెంచేసింది. ట్రైల‌ర్ చూస్తే క‌ల్కి ప‌క్కా యాక్ష‌న్ & థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పుష్క‌లంగా ఉన్న‌ట్టు తెలుస్తోంది.


ఇక ట్రైల‌ర్‌కు క‌మ‌ర్షియ‌ల్ ట్రైల‌ర్ అని పేరు పెట్ట‌డాన్ని బ‌ట్టి చూస్తే మ‌రో ట్రైల‌ర్ కూడా రిలీజ్ చేయ‌నున్నారు. ఇక ట్రైల‌ర్‌లో సినిమా లైన్, సబ్జెక్ట్ ఏమాత్రం బయటపెట్టలేదు. రాజ‌శేఖ‌ర్ ప‌వ‌ర్ ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా క‌నిపిస్తున్నాడు. మ‌ర్డ‌ర్‌, మిస్ట‌రీ, యాక్ష‌న్ నేప‌థ్యంలో క‌ల్కిలో కావాల్సిన ఎలిమెంట్స్ పుష్క‌లంగానే ఉన్నాయి. ఈ నెలాఖరులో విడుదలయ్యే కల్కికి ప్రశాంత్ వర్మ దర్శకుడు.


మరింత సమాచారం తెలుసుకోండి: