‘మహర్షి’ సూపర్ సక్సస్ కావడంతో మహేష్ తో పాటు అల్లరి నరేశ్ కూడ మంచి జోష్ లో ఉన్నాడు. ఇలాంటి పరిస్థుతులలో యాదృశ్చికంగా అతడు నటించిన మొదటి సినిమా ‘అల్లరి’ విడుదలై నేటితో 17 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంలో ఈ అల్లరోడు చేసిన ట్విట్ అందరికీ బాగా కనెక్ట్ అయింది. 

అంతేకాదు ‘అల్లరి’ సినిమాలో నరేశ్ నటించిన పాత్ర పేరు రవి అయితే అనుకోకుండా ‘మహర్షి’ సినిమాలో నరేశ్ నటించిన పాత్ర పేరు కూడ రవి కావడం ఆశ్చర్యకరం. ఇప్పటి వరకు అనేక కామెడీ పాత్రలు చేసి టాప్ కామెడీ హీరోగా తనకంటూ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకతను ఏర్పరుచుకున్న ఈ సుడిగాడు ‘మహర్షి’ సినిమాతో 55 సినిమాలు పూర్తి చేసాడు. 

ఈమూవీలో ఇతడి నటనకు మహేష్ తో సమానంగా ప్రశంసలు వస్తున్నాయి అంటే ఈమూవీ నరేశ్ కెరియర్ కు ఎలాంటి టర్నింగ్ పాయింట్ గా మారిందో అర్ధం అవుతుంది. 17 ఏళ్ల క్రితం తాను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చినప్పుడు తాను హీరోగా సరిపోతానా అన్న అనుమానంతో ఇండస్ట్రీకి వచ్చానని అలాంటి తనను ఇన్ని సంవత్సరాలు ఆదరించిన ప్రేక్షకులకు తాను ఏమిచ్చి ఋణం తీర్చుకోగలను అంటూ భావోద్వేగంతో కామెంట్స్ చేసాడు. 

అంతేకాదు ‘మహర్షి’ మూవీలోని రవి పాత్ర ద్వారా తన కెరియర్ కు సంబంధించి ఒక సర్కిల్ పూర్తి అయింది అంటూ తనను ప్రోత్సహించిన మహేష్ కు వంశీ పైడిపల్లికి కృతజ్ఞతలు తెలియచేసాడు. ‘లెజెండ్’ సినిమాతో జగపతి బాబు టాప్ విలన్ గా మారిపోయాడు. ఇప్పుడు ‘మహర్షి’ సినిమాతో నరేశ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మరిన్ని సినిమాలలో నటించే ఆస్కారం స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా మహేష్ అమెరికా నుండి తిరిగి ఇండియా వచ్చి నరేశ్ ఇంటికి వెళ్ళినప్పుడు కేవలం డైలాగ్స్ లేకుండా కళ్ళతో నటించిన నరేశ్ నటనకు మహేష్ అభిమానులు కూడ ‘ఫిదా’  అయిపోయారు అంటే ఈ అల్లరోడికి మళ్ళీ మంచిరోజులు ప్రారంభం అయ్యాయి అని అనిపించడంలో ఎటువంటి సందేహం లేదు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: