‘మహర్షి’ మూవీలో కనీసం రామ్ చరణ్ వాయస్ ఓవర్ కూడ లేదు. అలాంటిది ‘మహర్షి’ మూవీలో పరోక్షంగా రామ్ చరణ్ ప్రస్తావన రావడం మెగా అభిమానులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. 

ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన అబ్బాయి పేరు రామ్ చరణ్. అయితే ఈ మూవీ టైటిల్ కార్డ్స్ లో మాత్రం చక్రీ అన్న పేరుతో టైటిల్ వేసారు. ఈ చైల్డ్ ఆర్టిస్ట్ కు ‘మహర్షి’ 47వ మూవీ కావటం అందర్నీ ఆశ్చర్య పరిచే విషయం. 

కూకట్ పల్లి కి చెందిన ఈ చిన్నోడు ఇప్పటికే టాప్ హీరోల సినిమాలలో నటించి మెప్పించాడు. ‘మిర్చి’ ‘మహానటి’ ‘మహానుభావుడు’ ‘బ్రహ్మోత్సవం’ ‘మనం’ ‘నాన్నకు ప్రేమతో’ సినిమాలలో టాప్ హీరోలతో నటించాడు.  అంతేకాదు సినిమాలు అంటే విపరీతమైన అభిమానం ఉన్న ఈ బుడ్డోడికి  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  నుంచి ఛైల్డ్ ఆర్టిస్ట్ గా లైఫ్ టైమ్ మెంబర్ షిప్ ఇచ్చారు. 

ప్రస్తుతం మూడో క్లాస్ చదువుతున్న ఈ అబ్బాయి వార్తలు ‘మహర్షి’ మూవీతో మీడియాకు హాట్ టాపిక్ గా మారాడు. ఈ పిల్లోడి తండ్రి  కేపీహెచ్ బీలో డిజిటల్ స్టూడియో నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. మరి రానున్న రోజులలో ఈ చైల్డ్ ఆర్టిస్ట్ హీరోగా మారుతాడా లేదా అన్నది చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: