నందమూరి బాలకృష్ణకు ఆత్మాభిమానం చాల ఎక్కువ. ఈ లక్షణం వల్ల బాలయ్య తనతో సినిమాలు చేయమని ఏ టాప్ దర్శకుడితోను రాయబారాలు చేయడు. తనను నమ్ముకుని వచ్చిన దర్శక నిర్మాతలతోనే బాలయ్య సినిమాలు చేస్తాడు.

ఇలాంటి పరిస్థుతులలో బాలయ్య లేటెస్ట్ మూవీ టైటిల్ ప్రకటన అతడి అభిమానుల ఇగోను హర్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాభవం తరువాత బాలకృష్ణ కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న మూవీ ఈవారం ప్రారంభం కాబోతోంది. 

ఈమూవీని అత్యంత వేగంగా పూర్తిచేసి బాలకృష్ణకు ఏర్పడ్డ పరాభవాన్ని తొలిగించాలని రవికుమార్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి ‘రూలర్’ అన్న టైటిల్ ఫిక్స్ చేయడం బాలయ్య అభిమానుల ఇగో ను దెబ్బతీస్తోంది. బోయపాటి దర్శకత్వంలో జూనియర్ నటించిన ‘దమ్ము’ సినిమాలో ‘రూలర్’ అన్న పాట ఉంది. 

ఆపాట సూపర్ హిట్ అయిన పరిస్థుతులలో అప్పట్లో అదే టైటిల్ తో జూనియర్ ఒక సినిమా చేయాలని ప్రయత్నించినా అది కుదరలేదు. ఇప్పుడు అదే ‘రూలర్’ పదాన్ని బాలయ్య సినిమాకు టైటిల్ గా మార్చడంతో ఎవర్నీ ఫాలో కాని బాలకృష్ణ జూనియర్ ను అనుసరిస్తున్నాడా అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనితో షాక్ అయిన బాలయ్య అభిమానులు తమ హీరో సినిమాకు జూనియర్ టైటిల్ ఎందుకు అంటూ తీవ్ర అసహనంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ వార్త ఇలా వైరల్ కావడంతో రవికుమార్ బాలయ్య సినిమాకు వేరే టైటిల్ ఆలోచిస్తాడేమో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: