‘మహర్షి’ మూవీకి తెలుగు రాష్ట్రాలలో కలక్షన్స్ బాగానే ఉన్నా ఈమూవీ విడుదలై ఇన్నిరోజులు గడిచినా ఇప్పటికీ ఓవర్సీస్ లో రెండు మిలియన్ డాలర్స్ కలక్షన్ మార్క్ ను ఇంకా చేరుకోకపోవడం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. దీనికితోడు ఈమధ్య కాలంలో ఓవర్సీస్ ప్రేక్షకుల మనస్తత్వంలో వచ్చిన ఊహించని మార్పులు కూడ ‘మహర్షి’ ఓవర్సీస్ పరాభవం వెనుక కారణం అని తెలుస్తోంది.

మహేష్ నటించిన తొమ్మిది సినిమాలు హిట్ లేదా ఫ్లాప్ టాక్ తో సంబంధం లేకుండా ఒక మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిపోతే మంచి టాక్ తెచ్చుకుని కూడ ‘మహర్షి’ ఇప్పటికీ రెండు మిలియన్ డాలర్ల క్లబ్ లోకి చేరకపోవడం చాల మందికి ఆశ్చర్య పరుస్తోంది. ‘మహర్షి’ ఓవర్సీస్ బయ్యర్ నష్టాలు లేకుండా బయటకు రావాలి అంటే ఈమూవీకి 4 మిలియన్ డాలర్లు కలక్షన్స్ రావలసి ఉంది. 

దీనికితోడు అత్యంత ఆశ్చర్యకరంగా ‘అజ్ఞాతవాసి’ లాంటి భయంకరమైన ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీకి కూడ రేను మిలియన్ డాలర్లు సులువుగా వస్తే ఇంకా ‘మహర్షి’ ఆ రేంజ్ కి కూడ చేరకపోవడం వెనుక ఒక ఆసక్తికర కారణం బయటపడుతోంది. ఈమధ్య కాలంలో అమెరికాలోని తెలుగు ప్రేక్షకులు టాప్ హీరోల సినిమాలను కూడ ధియేటర్లలో చూడటం కంటే కేవలం నాలుగు వారాలు ఓపిక పడితే అమజాన్ ప్రైమ్ లో టాప్ హీరోల సినిమాలు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఆ సినిమాలను తమ ఇంటిలో హోమ్ దియేటర్స్ లో తమ కుటుంబం స్నేహితులతో వీకెండ్ పార్టీలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమాలు చూస్తున్న పరిస్థుతులలో ఎంతటి టాప్ హీరోల సినిమాలకు అయినా ఓవర్సీస్ లో కలక్షన్స్ ఎదురీత వస్తోంది అన్న విశ్లేషణలు వస్తున్నాయి.

దీనితో ఓవర్సీస్ ప్రేక్షకుల కోసం ‘మహర్షి’ ఓవర్సీస్ బయ్యర్ ప్రకటించిన 1+1 టిక్కెట్ ఆఫర్ కూడ ఓవర్సీస్ ప్రేక్షకులను పెద్దగా ఆకర్షించలేదు అన్న వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈమధ్య కాలంలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ‘మజిలీ’ ‘జెర్సీ’ సినిమాలకు కూడ వాటి టాక్ తో సంబంధం లేకుండా ఇలా ఓవర్సీస్ కలక్షన్స్ లో ఎదురీత ఎదురు కావడం ఓవర్సీస్ ప్రేక్షకుల మనస్తత్వంలో వచ్చిన మార్పులు అని అంటున్నారు. ఈ పరిస్థుతులు ఇలాగే కొనసాగితే రానున్న రోజులలో టాప్ హీరోల సినిమాలకు సంబంధించి ఓవర్సీస్ మార్కెట్ లో క్రేజ్ బాగా తగ్గిపోయే ఆస్కారం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: