‘సైరా’ చిత్రీకరణ చివరి దశకు చేరుకోవడంతో ఈమూవీ షూటింగ్ లో అనుష్క వచ్చి చేరడం వెనుక పెద్ద కథ నడిచింది అన్న వార్తలు వస్తున్నాయి. ఈమూవీ కథ ప్రధమ స్వాతంత్రోద్యమ కాలం నాటిది కాబట్టి అప్పటి కథను ఇప్పటితరం ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ఈమూవీ కథ చెప్పే పాత్రలో అనుష్క ఈసినిమాలో ఒక అతిథి పాత్రలో కనిపిస్తోంది. 

‘సైరా’ హిందీ భాషలో కూడ విడుదల అవుతున్న నేపధ్యంలో ‘సైరా’ కథను చెప్పే పాత్రలో నటించే నటికి నేషనల్ స్థాయిలో ఇమేజ్ ఉండాలి అన్న ఉద్దేశ్యంతో చిరంజీవి పట్టుపట్టి చరణ్ ద్వారా రాయబారాలు చేయించి అనుష్కను ఈ అతిథి పాత్రకు ఒప్పించినట్లు టాక్. వాస్తవానికి ఈ అతిథి పాత్రలో నటించే విషయంలో అనుష్క తన నిర్ణయం చెప్పడానికి చాల సమయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

ఎట్టకేలకు అనుష్క అంగీకారం లభించడంతో ఆమె పాత్రకు సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ లో జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఆమెను ‘సైరా’ లో ఒప్పించడానికి చరణ్ ఆఫర్ చేసిన అత్యంత భారీ పారితోషికం అని అంటున్నారు. 

కేవలం కొన్ని సీన్స్ లో మాత్రమే కనిపించే అనుష్క పాత్ర షూటింగ్ కోసం అనుష్క డేట్స్ ను ఆరు రోజులు అడిగినట్లు టాక్. ఈ ఆరు రోజుల కోసం మెగా ఫ్యామిలీ నుండి అనుష్క కోటి రూపాయలను డిమాండ్ చేసింది అన్న వార్తలు వస్తున్నాయి. చిరంజీవి సినిమాలో నటించే అవకాసం వస్తే చాలు అని చాలమంది భావిస్తున్న పరిస్థుతులలో అనుష్క ఈ రేంజ్ లో డిమాండ్ చేయడమే కాకుండా తన డిమాన్స్ ను నిలబెట్టుకోవడంలో ఆమె రేంజ్ కనిపిస్తోంది అంటూ ఇండస్ట్రీ వర్గాలలో కామెంట్స్ వినిపిస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: