జబర్దస్త్ వినోద్.. అంటే తెలియని వాళ్లు చాలా తక్కువ. ఆ షోతో అంతగా పాపులర్ అయ్యాడీ నటుడు.. అచ్చం అమ్మాయిలాగానే నటించే వినోద్‌కు చాలా ఫాలోయింగ్ ఉంది. అతని స్కిట్లకు ఆదరణ చాలా ఎక్కువ. 


అయితే మరి అంతగా అమ్మాయిలా నటించిన వినోద్.. రియల్ లైఫ్‌లో ఎలా ఉంటాడు.. పూర్తి స్థాయి అబ్బాయిగానే ఉంటాడా.. లేదా అన్న అనుమానం చాలా మందిలో ఉంది. కానీ వీరంతా కేరక్టర్ పరంగానే అమ్మాయి వేషాలు వేస్తారు.. రియల్ లైఫ్ లో నార్మల్ గానే ఉంటారట. 

ఆ మధ్య వినోద్ ఆత్మహత్య యత్నం చేశాడని రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనపైనా వినోద్ స్పందించాడు. అలాంటిదేమీ లేదని.. తాను టీవీ నైన్‌కు వెళ్లి వివరణ కూడా ఇచ్చానన్నాడు. ప్రస్తుతం తాను పెళ్లి ప్రయత్నాల్లో ఉన్నాడట. 

తాను అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని క్లారిటీగా చెబుతున్నాడు. తనకు పెద్దగా కాబోయే భార్యపై అంచనాలు లేవని.. తన తల్లిదండ్రులను సరిగ్గా చూసుకుంటే చాలని.. తన కేరీర్‌ కు సహకరించే భార్య అయితే బావుంటుందని చెప్పుకొచ్చాడు వినోద్. 



మరింత సమాచారం తెలుసుకోండి: