టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్‌కు టెంప‌ర్ సినిమా నుంచి ప‌ట్టింద‌ల్లా బంగారం అవుతోంది. 2015లో వ‌చ్చిన టెంప‌ర్ సినిమాకు ముందు ఎన్టీఆర్ వ‌రుస ప్లాపులు ఎదుర్కొన్నాడు. ఆ సినిమా త‌ర్వాత ఎన్టీఆర్ వ‌రుస‌గా నాన్న‌కు ప్రేమ‌తో - జై ల‌వ‌కుశ - అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ లాంటి వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. క‌థాప‌రంగా యావ‌రేజ్‌గా ఉన్నా కూడా ఎన్టీఆర్ యాక్ష‌న్‌తోనే ఈ సినిమాలు అన్ని సూప‌ర్ హిట్లు అవుతున్నాయి.

ఇక ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో మెగాప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి మెగా మ‌ల్టీస్టార‌ర్ సినిమాలో న‌టిస్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చ యేడాది రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో ఒక‌టిగా నిలుస్తుంద‌న్న అంచ‌నాలు ట్రేడ్ వ‌ర్గాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే ఎన్టీఆర్‌తో సినిమా చేయాల‌ని ఏ డైరెక్ట‌ర్‌కు అయినా కోరిక ఉంటుంది.

తాజాగా క్రియేటివ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీకి ట్విట్ట‌ర్‌లో ఓ అభిమాని నుంచి ఇలాంటి ప్ర‌శ్నే ఎదురైంది. గ‌తంలో వీరిద్ద‌రి కాంబోలో వ‌చ్చిన రాఖీ సినిమా హిట్ అవ్వ‌క‌పోయినా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకుంది. ఇక తాజాగా ట్విట్ట‌ర్‌లో చిట్ చాట్ చేసిన కృష్ణ‌వంశీకి ఓ అభిమాని నుంచి ఎన్టీఆర్‌తో ఓ రొమాంటిక్ సినిమా ఎప్పుడు ఉంటుంద‌న్న ప్ర‌శ్న ఎదురైంది.

 ఈ ప్ర‌శ్న‌కు కృష్ణ‌వంశీ బుద‌లు ఇస్తూ మీరు కోరుకున్న‌ట్టు అలాంటి సినిమాలు తీసేందుకు యువ ద‌ర్శ‌కులు చాలా మందే ఉన్నారు. రొమాంటిక్ సినిమాలు వారు చేస్తేనే బాగుంటుంద‌ని ఆన్స‌ర్ ఇచ్చాడు. తర్వాత సినిమాపై ఎప్పుడు క్లారిటీ ఇస్తారన్న ప్రశ్నకు కృష్ణవంశీ సమాధానం దాటవేశాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: