మెగా కాంపౌండ్ హీరోగా ఎంట్రీ ఇచ్చినా కెరీర్లో అనుకున్న రేంజ్‌కు వెళ్ల‌లేదు అల్లు శిరీష్‌. అటు అన్న స్టైలీష్‌స్టార్‌గా దూసుకుపోతున్నాడు. ఇటు నాన్న అల్లు అర‌వింద్ స్టార్ ప్రొడ్యుస‌ర్‌. ఇవ‌న్నీ ఉండి కూడా అల్లు శిరీష్‌కు స‌రైన రేంజ్‌కు వెళ్ల‌లేదు. ఇక చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత శిరీష్ హీరోగా తెర‌కెక్కిన ఏబీసీడీ సినిమా ఈ శుక్ర‌వారం థియేట‌ర్ల‌లోకి దిగుతోంది. ఈ సినిమా హిట్ శిరీష్‌కు చాలా అవ‌స‌రం. 

2016లో వ‌చ్చిన ప‌ర‌శురాం తెర‌కెక్కించిన శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు సినిమా త‌ర్వాత శిరీష్‌కు హిట్ లేదు. మ‌ధ్య‌లో ఒక్క క్ష‌ణం చేసినా అనుకున్న స్థాయిలో స‌క్సెస్ కాలేదు. అన్నింటికి మించి ఈ సినిమాకు సూప‌ర్ టాక్ వ‌చ్చి.... భారీ లాభాలు వ‌స్తేనే శిరీష్ మార్కెట్ నిల‌బ‌డుతుంది. లేక‌పోతే మ‌ళ్లీ ప‌రిస్థితి పాతాళ‌మే అన్న‌ట్లు ఉంటుంది. ఇక ఈ సినిమా హిట్ అవ్వ‌డం హీరో శిరీష్‌కు ఎంత ఇంపార్టెంటో అటు హీరోయిన్ రుక్సార్ దిల్లోన్‌కు కూడా అంతే ఇంపార్టెంట్‌. 

2017లోనే తెలుగు పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన రుక్సార్ ఇప్పటి వరకు సాలిడ్ హిట్ చూడలేదు. ఆక‌తాయి, కృష్ణార్జున యుద్ధం రెండూ బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్లే అయ్యాయి. దీంతో రుక్సార్‌కు ఈ సినిమా హిట్ అవ్వ‌డం చాలా ఇంపార్టెంట్‌. ఈ సినిమా కూడా ఫ‌ట్ అయితే రుక్సార్ కెరీర్ పుంజుకోవ‌డం, ఆమెకు ఛాన్సులు రావ‌డం క‌ష్ట‌మే. దీంతో ఇప్పుడు ఈ పంజాబీ బామ ఆశ‌లన్నీ ఈ సినిమా మీదే ఉన్నాయ్‌. మ‌రి ఈ ఇద్ద‌రి కెరీర్‌ను ఏబీసీడీ ఏం చేస్తుందో ?  చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: