కొంత కాలం క్రితం జూనియర్ సినిమాలు విడుదల అయినప్పుడల్లా ఆసినిమాల పై నెగిటివ్ ప్రచారం చేస్తున్న వ్యక్తులలో బాలకృష్ణ అభిమానులు కూడ ఉన్నారు అన్న వార్తలు వచ్చాయి. దీనితో బాలయ్య జూనియర్ ల మధ్య గ్యాప్ అప్పట్లో మరింత పెరిగిపోయింది. ఆతరువాత జూనియర్ బాలకృష్ణ కూతురు పెళ్ళికి కూడ వెళ్ళక పోవడంతో వీరిద్దరి గ్యాప్ ఓపెన్ టాపిక్ గా మారిపోయింది. అయితే గత సంవత్సరం హరికృష్ణ మరణం తరువాత బాలయ్య జూనియర్ ల మధ్య సాన్నిహిత్యం పెరగడం కనిపించింది. 

ముఖ్యంగా ఎన్టీఆర్ బయోపిక్ ఫంక్షన్ కు జూనియర్ కూడ రావడంతో ఇక నెమ్మదిగా జూనియర్ బాలయ్యలు తమ మధ్య జరిగిన విషయాలను మరిచిపోయి తామిద్దరం ఒక్కటే అన్న సంకేతాలు ఇస్తున్నారు అంటూ నందమూరి అభిమానులు ఆనంద పడ్డారు. ఇలాంటి పరిస్థుతులలో ఎన్నికల ఫలితాలు రాబోతున్న వేళ కొందరు సోషల్ మీడియాలో చేస్తున్న కామెంట్స్ తిరిగి బాలయ్య జూనియర్ ల మధ్య చిచ్చు పెట్టె ఆస్కారం కనిపిస్తోంది. 

రాబోతున్న ఎన్నికల ఫలితాలలో తెలుగుదేశం పార్టీ గెలవని పరిస్థితి ఏర్పడితే అప్పుడు పార్టీని బాలకృష్ణ కానీ లోకేష్ కానీ నిలపెట్టలేరనీ తిరిగి తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తేగల సత్తా ఒక్క జూనియర్ కు మాత్రమే ఉంది అంటూ తారక్ వీరాభిమాని ఒకడు చేసిన కామెంట్ బాలయ్య జూనియర్ అభిమానుల మధ్య మంటలు రేపుతోంది. అయితే ఈ వ్యాఖ్యలకు బాలయ్య అభిమానులు తీవ్రంగా స్పందిస్తూ గతంలో ఎన్టీఆర్ ఒకసారి ప్రచారం చేస్తే పార్టీ దెబ్బ తిందని ఆ తర్వాత అతను పార్టీకి ఏమీ చేయలేదని బాలయ్య సాయం తీసుకుని ఆ తర్వాత ఆయన్ని గౌరవించలేదని తారక్‌ కు టీడీపీలో స్థానమే లేదంటూ బాలయ్య అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 


ఈ కామెంట్స్ కు జూనియర్ అభిమానులు కూడ గట్టిగానే బదులు ఇస్తున్నారు. దీనితో ఈ ఇద్దరి అభిమానుల మధ్య ప్రస్తుతం భారీ ఎత్తున సోషల్ మీడియాలో ట్వీట్ యుద్ధం నడుస్తోంది. అయితే ఎన్నికల ఫలితాలు రాకుండానే పరిస్థితి ఇలా ఉంటే ఫలితాలు వచ్చిన తరువాత ఈ ట్విట్స్ యుద్ధం ఏ స్థాయికి చేరిపోతుందో అని నందమూరి అభిమానులు భయపడిపోతున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: