సినిమాల్లోకి ఎప్పుడు ఎలా వచ్చాము అన్నది కాదు... ప్రేక్షకులను ఎంతగా మెప్పించాము అన్నది ముఖ్యం.  ప్రేక్షకులను మెప్పించిన నటుడే చిరస్థాయిగా గుర్తుండిపోతాడు.  అలాంటి నటులు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు.  అప్పట్లో కామెడియన్లుగా చేసిన రమణారెడ్డి, రేలంగి, రాజబాబులు ఇప్పటికి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.  


వాళ్ళ తరువాత వచ్చిన కోటా, బ్రహ్మానందం, బాబుమోహన్ లు మంచి సినిమాలు చేసి మెప్పించారు.  వీరిలో కోటా శ్రీనివాసరావు కామెడీ తో పాటు విలన్ గా కూడా మెప్పించారు.  అటు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చెరగని ముద్ర వేశారు.  కోటా శ్రీనివాసరావు కెరీర్ను లైఫ్ టర్న్ చేసిన సినిమా అహనా పెళ్ళంట.  ఈ సినిమాలో కోటా లక్ష్మీపతి అనే పిసినారి పాత్ర చేశాడు.  ఆ పాత్ర ప్రతి ఒక్కరిని మెప్పించింది.  పిసినారి వ్యక్తిగా కోటా నటన అమోఘం. 


అసలు ఈ పాత్ర కోటా దగ్గరకు ఎలా వచ్చింది.  సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాలో లక్ష్మీపతి పాత్ర కోసం మొదట రావు గోపాలరావు ను అనుకున్నారట డి రామానాయుడు గారు.  కానీ, దర్శకుడు జంధ్యాల మాత్రం కోటాతోనే ఆ పాత్ర చేయించాలని పట్టుబట్టాడు.  దాదాపు ఇద్దరి మధ్య 20 రోజులపాటు ఈ పాత్ర గురించి.. చేయాల్సిన నటుడి గురించి చర్చలు...వాదోపవాదాలు జరిగాయి.  చివరకు జంధ్యాలదే పైచేయి అయ్యింది.  కోటా చేత లక్ష్మీపతి పాత్ర చేయించారు. సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా.. లక్ష్మీపతిగా కోట జీవించేశారు.  పిసినారి వ్యక్తులు ఎలా ఉంటారో అచ్చంగా అలాగే చేసి మెప్పించడం విశేషం. 


మరింత సమాచారం తెలుసుకోండి: