టాలీవుడ్‌లో ఇటీవ‌ల సోలో రిలీజ్‌లు ఎక్కువ అవుతున్నాయి. సోలోగా ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అయితే ఫ‌స్ట్ వీకెండ్‌తో పాటు, ఫ‌స్ట్ వీక్‌లో ఎక్కువ వ‌సూళ్లు రాబ‌ట్టుకోవ‌డం సినిమా యూనిట్ల‌కు ఆన‌వాయితీగా మారింది. అందుకే పెద్ద సినిమాలు సోలోగా ఎక్కువ థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతూ తొలి వారంలోనే టాక్‌తో సంబంధం లేకుండా భారీ క‌లెక్ష‌న్‌లు కొల్ల‌గొడుతున్నాయి. తాజాగా వ‌చ్చిన మ‌హేష్ బాబు మ‌హ‌ర్షి సినిమా సైతం టాక్ మిక్స్‌డ్‌గా ఉన్నా ఫ‌స్ట్ వీకెండ్‌లోనే ఏకంగా రూ.100 కోట్ల వ‌సూళ్లు కొల్ల‌గొట్టేసింది. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున వ‌ర్సెస్ నేచుర‌ల్ స్టార్ నాని మ‌ధ్య బాక్స్ ఆఫీస్ వేదిక‌గా వార్ త‌ప్పేలా లేదు. నాని హీరోగా విక్ర‌మ్ కె  కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన గ్యాంగ్ లీడ‌ర్ సినిమా రిలీజ్ డేట్ ప్ర‌క‌టించారు.  ఆగ‌ష్టు30వ తేదీన ఈ సినిమా థియేటర్ల‌లోకి వ‌స్తున్న‌ట్టు ప్ర‌క‌న వ‌చ్చేసింది. 


ఆగ‌ష్టు 15న యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ సాహో సినిమా థియేట‌ర్ల‌లోకి దూకుతోంది. ఇక ఇటీవ‌ల వ‌చ్చిన నాని జ‌ర్సీ సినిమా హిట్ అవ్వ‌డంతో గ్యాంగ్ లీడ‌ర్ సినిమాకు మంచి హైప్ క్రియేట్ అయ్యింది. ఇక నాగార్జున క్లాసిక్ మూవీ మ‌న్మ‌థుడికి సీక్వ‌ల్‌గా వ‌స్తున్న మ‌న్మ‌థుడు 2 సినిమా సైతం ముందుగా ఆగ‌స్టు చివ‌రిలో థియేట‌ర్ల‌లోకి రావాల‌ని షెడ్యూల్ ప్లాన్ చేసుకుంది. ఈ సినిమాతో నాగ్ చాలా రోజుల త‌ర్వాత మంచి హిట్ తన ఖాతాలో వేసుకోవాల‌ని చూస్తున్నాడు. నాగ్ ఆగ‌ష్టు చివ‌రిలో రావాల‌ని అనుకోవ‌డం... ఇప్పుడు ఆగ‌ష్టు 30న నాని గ్యాంగ్ లీడ‌ర్ డేట్ అనౌన్స్ చెయ్య‌డంతో ఇప్పుడు నాగార్జున ప‌రిస్థితి అడ క‌త్తెర‌లో పోక చెక్క మాదిరిగా ఉంది. 


డేట్‌ను ముందుకు జ‌రుపుదామా అంటే ప్ర‌భాస్ సాహో సినిమాకు పోటీగా వెళ్లి మ‌న్మ‌థుడు 2 నిల‌బ‌డ‌డం క‌ష్ట‌మే. ఆ త‌ర్వాత వాయిదా వేద్దామనుకుంటే అక్టోబ‌ర్‌లో ద‌స‌రా సంద‌ర్భంగా కొన్ని పెద్ద సినిమాలు షెడ్యూల్ అయ్యి ఉన్నాయి. సైరా అక్టోబ‌ర్ 2న వ‌స్తే ఆ సినిమా హ‌డావిడి ఎలా లేద‌న్నా మూడు వారాలు ఉంటుంది. అప్పుడు సైరాకు పోటీగా వెళ్లినా మ‌న్మ‌థుడు 2 రిస్క్ చేసిన‌ట్టే. దీంతో ఇప్పుడు నాని డెసిష‌న్‌కు నాగార్జున సందిగ్ధంలో ప‌డిన‌ట్లు అయింది. మ‌రి మ‌న్మ‌థుడు-2 కి ఎప్పుడు మంచి రిలీజ్ డేట్ ద‌క్కుతుందో ? చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: