తెలుగు ఇండస్ట్రీలో అతి తక్కువ కాలంలో విపరీతమైన క్రేజ్ సంపాదించిన హీరోల్లో అతి కొద్ది మందే ఉన్నారు.  అలాంటి వారిలో విజయ్ దేవరకొండ ఒకరు.  పెళ్లిచూపులు తో మొదలు పెట్టి టాక్సీవాలా వరకు వరుస బిగ్గెస్ట్ హిట్స్ అందుకుంటూ వచ్చాడు. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో యూత్ ఐకాన్..క్రేజీ స్టార్ గా మారాడు.  తాజాగా విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్‌పై కొత్త చిత్రం `హీరో` ఆదివారం లాంఛ‌నంగా ప్రారంభంమైన విషయం తెలిసిందే.  గతంలో ఈ పేరుతో  చిత్రాలు రిలీజ్ అయ్యాయి..చిరంజీవి నటించిన హీరో చిత్రం అప్పట్లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచింది.  


ఆ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘హీరో’చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యింది.  మరి ఇప్పుడు విజయ్ దేవరకొండ వంతు వచ్చింది..మరి ఈ చిత్రం కథ,కథనం ఎలా ఉండబోతుంది..మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటాడా లేదా అన్నది త్వరలో తెలియనుంది.  ఆనంద్ అన్నామ‌లై ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేయ‌బోతున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ హీరో హీరోయిన్‌ల‌పై క్లాప్ కొట్టారు. అలాగే ద‌ర్శ‌కుడికి స్క్రిప్ట్‌ను అందించారు. ఎమ్మెల్యే ర‌వికుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. 


స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మ్యూజిక‌ల్ థ్రిల్ల‌ర్ జోన‌ర్‌లో `హీరో` సినిమా తెర‌కెక్క‌నుంది. విజ‌య్ దేవ‌ర‌కొండ తొలిసారి ఇలాంటి డిఫ‌రెంట్ జోన‌ర్ మూవీలో న‌టిస్తున్నారు. పేట్ట ఫేమ్ మాళ‌వికా మోహ‌న‌న్ ఈ చిత్రంతో తెలుగు చిత్రసీమ‌లోకి హీరోయిన్‌గా అడుగుపెడుతున్నారు. ప్ర‌దీప్‌కుమార్ సంగీతం అందించ‌బోయే ఈ చిత్రానికి ముర‌ళి గోవింద రాజులు సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: