మహర్షి సినిమా రైతు సమస్యల చుట్టూ నడుస్తుంది.  రైతుల కష్టాలను చూసి అయ్యో పాపం అనడం కాదు వాళ్లకు సహాయ పడాలి.  రైతులను కేవలం న్యూస్ ఐటెం గా తీసుకోవడం కాదు.. వాళ్లకు సానుభూతి ఇవ్వకపోయినా ఫర్వాలేదు... రెస్పెక్ట్ ఇస్తే చాలు.. అనే థీమ్ తో సినిమా తెరకెక్కింది.  సినిమా సూపర్ హిట్టైంది.  ఇందులో హీరో తాను సంపాదించినా దాంట్లోనుంచి 90 శాతం నిధులను రైతులకు ఖర్చు చేస్తున్నట్టు ప్రకటిస్తాడు.  వీకెండ్ ఫార్మింగ్ పేరుతో తలపెట్టిన వ్యవసాయం పనులకు మంచి క్రేజ్ వచ్చింది.  


ఇది హీరో రీల్ లైఫ్ లో చేసిన పని.  అసలు విషయం ఏమంటే.. రియల్ లైఫ్ లో ఇలా చేసేవాళ్ళు ఉంటారా.  సంపాదించిన దాన్ని ఇతరుల కోసం ఖర్చు పెట్టె వ్యక్తులు ఉంటారా అంటే ఉంటారని అంటున్నారు ఆఫ్రికాకు చెందిన వ్యాపారవేత్త రాబర్ట్ ఎఫ్ స్మిత్. ఉన్నత విద్యను చదువుకోవడానికి చాలామంది స్టూడెంట్స్ బ్యాంకుల వద్ద రుణాలు తీసుకొని చదువుతుంటారు.  రుణాల వడ్డీ పెరిగిపోతుంది.  ఫలితంగా ఆయా కుటుంబాల ఆర్ధిక పరిస్థితి దారుణంగా మారిపోతుంది.  


దీనిని గమనించిన రాబర్డ్ ఎఫ్ స్మిత్ అమెరికాలోని అట్లాంటా బ్లాక్ మోరిస్ హౌస్ కాలేజీలో చదువుతున్న విద్యార్థుల మీదున్న రూ.250 కోట్ల రూపాయల రుణాలను తాను చెల్లిస్తున్నట్టు ప్రకటించాడు. రాబర్ట్ స్మిత్ నిర్ణయంతో అనేకమంది విద్యార్థిని విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.  ఎంతో కష్టపడి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు బ్యాంకు రుణాల కారణంగా సరిగా చదువుకోలేకపోవడం తెలిసిందే.  అందుకోసమే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఈ కాలేజీలో జరిగిన పట్టా ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన ఈ సంచలన నిర్ణయం తీసుకున్నారు.  


మరింత సమాచారం తెలుసుకోండి: